మరో అడల్ట్ మూవీకి ఓకే చెప్పిన యంగ్ హీరో?

Tue Jul 14 2020 15:20:33 GMT+0530 (IST)

Young hero who says ok to another adult movie

ఈమద్య కాలంలో ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అడల్ట్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అడల్ట్ సినిమాలకు ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నేపథ్యంలో మేకర్స్ కూడా చిన్న బడ్జెట్ తో అలాంటి సినిమాలను తెరకెక్కించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందబోతుంది. ఆ సినిమా న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ అంటున్నారు.ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ గుంటూర్ టాకీస్ మరియు కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాలతో హీరోగా మెప్పించాడు. కాస్త బోల్డ్ పాత్రలను ఈయన చేయడంలో దిట్ట అంటూ ముద్ర పడిపోయాడు. అందుకే మరోసారి సిద్దుకు అలాంటి అవకాశాన్నే సితార ఎంటర్ టైన్‌మెంట్స్ వారు ఇచ్చారు.

విమల్ రెడీ చేసిన స్క్రిప్ట్ కాస్త బోల్డ్ గా ఉండటంతో పాటు యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సిద్దుకు ఇది మరో హిట్ ఇస్తుందా చూడాలి.