Begin typing your search above and press return to search.

ఒకేసారి సూపర్‌ స్టార్‌.. యూనివర్శిల్‌ స్టార్‌ లతో..!

By:  Tupaki Desk   |   23 Jan 2020 10:01 AM GMT
ఒకేసారి సూపర్‌ స్టార్‌.. యూనివర్శిల్‌ స్టార్‌ లతో..!
X
దర్శకుడు అవ్వాలనుకున్న సిద్దార్థ అనూహ్యంగా హీరో అయ్యాడు. సహాయ దర్శకుడిగా ఉన్న సిద్దార్థ హీరోగా మారాడు. హీరోగా సిద్దార్థ దాదాపు పదేళ్ల పాటు వెనుదిరిగి చూసుకోకుండా వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా హీరోగా అడపా దడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. కాని సక్సెస్‌ శాతం తగ్గడం తో కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సిద్దార్థ తన జోరును మరింత పెంచాడు.

శంకర్‌ దర్శకత్వంలో యూనివర్శిల్‌ స్టార్‌ హీరోగా రూపొందుతున్న ఇండియన్‌ 2 చిత్రంలో కీలక పాత్రను సిద్దార్థ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఇండియన్‌ 2 చిత్రంతో సిద్దార్థ్‌ మరోసారి బిజీ అవుతాడంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మూవీలో కూడా సిద్దార్థ నటించబోతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

శివ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం లో ముఖ్య పాత్రను సిద్దార్థ తో చేయించాలని మేకర్స్‌ నిర్ణయించారు. ఇప్పటి కే మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ ను ఈనెల చివరి వారంలో ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ ను ఖరారు చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేస్తామని అంటున్నారు.

రజినీకాంత్‌ మరియు కమల్‌ హాసన్‌ ల చిత్రాల్లో ఒకేసారి ఛాన్స్‌ దక్కించుకున్న సిద్దార్థ ముందు ముందు మరిన్ని చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తాడని అంటున్నారు. హీరోగా కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పి ఇలాగే కొన సాగితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.