వైభవంగా బాలీవుడ్ లవ్ బర్డ్స్ వివాహ మహోత్సవం

Tue Feb 07 2023 19:16:02 GMT+0530 (India Standard Time)

Siddharth Kiara Finally Becomes Husband Wife Now

బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్ర.. కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. కుటుంబ సభ్యులు మరియు ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏకం అయ్యింది. గత నెల రోజులుగా వీరి పెళ్లి గురించి జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్న విషయం తెల్సిందే.వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక అయ్యింది. గత మూడు రోజులుగా పెళ్ళి వేడుక కొనసాగుతోంది. బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులను రిసీవ్ చేసుకోవడం కోసం ఏకంగా 70 లగ్జరీ కార్లను వివాహ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

వంటలు వండటానికి మరియు వడ్డించడానికి ముంబయి మరియు ఢిల్లీ నుండి దాదాపుగా 500 మంది వెయిటర్లను మరియు వంట వారిని రప్పించారు. నేడు రాత్రి జరుగనున్న బరాత్ కార్యక్రమంతో కియారా మరియు సిద్దార్థ్ మల్హోత్ర యొక్క వివాహ వేడుక లు ముగియబోతున్నాయి.

ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ ఈ వివాహాన్ని నిర్వహించిందట. రోజుకు రెండు కోట్ల రూపాయల ఖర్చు తో ఈ బాలీవుడ్ స్టార్ లవ్ బర్డ్స్ ను ఏకం చేయడం జరిగిందట. పెళ్లికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఇప్పటికే భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారా ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది.

హిందీలో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తోంది. ఇక సిద్దార్థ్ హిందీలో యంగ్ స్టార్ హీరోగా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత వీరి కెరీర్ మరింత స్పీడ్ గా దూసుకు వెళ్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి సందర్భంగా సెలబ్రెటీలు మరియు అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.