కొత్త బంగారు లోకం పాప.. నిజంగా తనేనా..

Sat Dec 03 2022 14:00:02 GMT+0530 (India Standard Time)

Shweta Basu Prasad was among those who fell down at jet speed.

కొంతమంది హీరోయిన్స్ మొదట్లో వచ్చినప్పుడు భారీ స్థాయిలో సక్సెస్ అందుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి డౌన్ ఫాల్ అయిపోయిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఆ విధంగా జెట్ స్పీడ్ లో డౌన్ ఫాల్ అయిన వారిలో శ్వేతా బసు ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 'కొత్త బంగారులోకం' ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో ఆమె జీవితానికి సరిపోయేంత క్రేజ్ అయితే అందుకుంది అని చెప్పవచ్చు.ఎందుకంటే ఆ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ అలాంటిది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా శ్వేతా బసు ప్రసాద్ క్రేజ్ అందుకుంది. కానీ ఆ హీరోయిన్ గా ఆమె ఎక్కువ కాలం పాటు పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని చేదు అనుభవాలను దాటిన శ్వేతా బసు ప్రసాద్ ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా ప్రయత్నం చేసింది.

ఆ రూట్లో కూడా సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో నార్త్ ఇండస్ట్రీలో కొనసాగే ప్రయత్నం చేస్తుంది. ఓటీటీ కంటెంట్ పరంగా అయితే ఆమెకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. మంచి మంచి వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. అయితే అప్పుడప్పుడు ఈ విధంగా గ్లామర్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేస్తూ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది.

ఒకప్పుడు కొత్త బంగారులోకం లో చాలా క్యూట్ గా కనిపించిన శ్వేత ఇప్పుడు ఈ విధంగా మారిపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందమైన చిరునవ్వుతో ఎప్పుడూ కూడా చాలా క్యూట్ గా కనిపించే శ్వేత ఇప్పుడు మాత్రం గ్లామర్ తో డిఫరెంట్ గా కనిపిస్తోంది. అవకాశం వస్తే ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ఆమె ఈ ఫోటోలతో ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది. మరి ఆ రూట్లో కొత్త అవకాశాలు ఏమైనా వస్తాయో లేవో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.