బంగారు లోకం కొత్తగా నిర్మించుకోవాలి!

Tue Mar 02 2021 09:00:01 GMT+0530 (IST)

Shweta Basu Prasad Latest Stunning Pose

కొందరి జీవితం చాలా వేగంగా పరిగెత్తుతుంది. సాధా సీదా లైఫ్ కి భిన్నంగా సాగుతుంది. కొత్త బంగారు లోకం ఫేం శ్వేతాబసు ప్రసాద్ లైఫ్ మెలో డ్రామా గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనే లేదు. గొప్ప ప్రతిభావనిగా ఆరంభ చిత్రాలతోనే పేరు తెచ్చుకుని గొప్ప స్టార్ గా ఎదిగేస్తుందని భావిస్తే.. శ్వేతాబసు అనుకున్నది ఒక్కటి అయినదొక్కటీ!నిజం చెప్పాలంటే గొప్ప కెరీర్ వెలుగులతో కొత్త బంగారు లోకం లా  మెరవాల్సిన లైఫ్ శ్వేతాది. ఊహించని పరిణామాల నడుమ తనపై రకరకాల నిందలు పడ్డాయి. ముఖ్యంగా తనపై వ్యభిచార ఆరోపణలు రావడం తన లైఫ్ ని కెరీర్ ని పెద్ద డ్యామేజ్ చేసింది. కొన్నాళ్ల పాటు మానసిక పరివర్తన గృహంలో ఉండి అటుపై తిరిగి తన ఇంటికి చేరుకుంది. కొంతకాలం పాటు అనురాగ్ బసు వంటి దర్శకుడితో కలిసి పలు చిత్రాలకు కెమెరా వెనక కూడా పని చేసింది. సొంతంగా లఘు చిత్రాల్ని శ్వేతాబసు తెరకెక్కించింది.

ఇక లైఫ్ లో ఊహించని మరో ఘటన కూడా ప్రముఖంగానే చర్చకు వచ్చింది. తన చిన్న నాటి స్నేహితుడు రోహిత్ మిట్టల్ ని పెళ్లాడి ఏడాదికే బ్రేకప్ చెప్పేయడం అప్పట్లో సంచలనమే అయ్యింది. ప్రస్తుతం శ్వేతా ఒంటరి. అయినా తన లైఫ్ డైలమాల నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండేందుకు తన ప్రయత్నం ఎప్పుడూ మానలేదు. నిరాశను దరిచేరనివ్వక ఆనందమయ జీవితం కోసమే తన ప్రయాణం అని చెప్పకనే చెబుతోంది. తాజాగా సోషల్ మీడియాల్లో శ్వేతాబసు షేర్ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కొత్తగా నిర్మించుకుంటేనే బంగారు లోకం! అందుకోగలరు ఎవరైనా అనేందుకు వర్ధమాన తార శ్వేతాబసునే పర్ఫెక్ట్ ఉదాహరణ.