కమల్ ఓటమి.. శృతిహాసన్ ఆశ్చర్యకరమైన కామెంట్!

Tue May 04 2021 13:15:00 GMT+0530 (IST)

Shruti hassan surprising comment On Kamal Defeat

మక్కల్ నీది మయ్యం అధినేత.. ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ ఓడిపోయారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. తొలి సారి ఎన్నికలను ఎదుర్కొన్న ఆయనకు నిరాశే ఎదురైంది.తన సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1540 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. వనతికి 52627 ఓట్లు రాగా.. కమల్ కు 51087 ఓట్లు పోలయ్యాయి. 2008లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు అన్నాడీఎంకే గెలించింది. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించింది.

కమల్ తొలి ఎన్నికలోనే ఓటమిపాలవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఈ విషయంపై కమల్ కూతురు స్టార్ హీరోయిన్ అయిన శృతిహాసన్ స్పందించారు. ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన శృతి.. తన ఇన్ స్టా అకౌంట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.