శృతి గారి సంగీత సాధన మరోసారి?

Sun May 31 2020 12:18:10 GMT+0530 (IST)

Shruti Hassan Dives Into Music Once Again!

అదేంటో కానీ 'గబ్బర్ సింగ్' సినిమాలో పని చేసిన మెయిన్ టీమ్ అంతా మహా మహా గబ్బర్ సింగులే.  పవన్ కళ్యాణ్ అసలు గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ సంగతి తెలిసిందే. ఇక బండ్ల సంగతి తెలియనివారు అసలు మనిషే కాదు. హీరోయిన్ శృతి ఏమైనా తక్కువా? ఆమె లేడీ గబ్బర్ సింగ్.  ఆమె తిక్కకు లెక్క పక్కా అస్సలు ఉండవు.  సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు లవ్వు గివ్వు.. సంగీత సాధన అంటూ కెరీర్ ను అటూ ఇటూ చేసుకుంది.ఆ తర్వాత లండన్ లో చేసిన సంగీత సాధన సరిపోలేదు. కోర్సలేతో లవ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేదు. దీంతో అంతా తుస్సు... కస్సుబుస్సుమంటూ ఇండియాకు వచ్చేసింది. హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుగు.. తమిళం.. హిందీలో అవకాశాలు దక్కడంతో ఇక  సినిమాలను సీరియస్ గా తీసుకుంటుందని చాలామంది తమ మనసులకు సర్దిచెప్పుకున్నారు. కానీ ఈమధ్య మళ్ళీ సంగీత సాధన వైపు శృతి మనసు తెగ లాగుతోందట.

మరి సినిమాలను పక్కన పెట్టేసి రాక్.. పాప్.. జాజ్ అంటూ గానా బజానా మొదలుపెడుతుందా లేక సినిమాలపైనే శ్రద్ధ చూపిస్తూ ఎక్కువకాలం హీరోయిన్ గా కొనసాగుతుందా అనేది సన్నిహితులకు అంతుచిక్కడం లేదట. మనం ఇందాక మొదటి పారాగ్రాఫ్ లో చెప్పుకున్నట్టు ఆమె లేడీ గబ్బర్ సింగ్.  అందరూ అనుకున్నట్టు.. అందరూ చేసినట్టు చేస్తే అమె శృతి హాసన్ ఎందుకు అవుతుంది? ఆమె మనసు ఏం చెప్తుందో అదే చేస్తుంది. మరి ఆ మనసు ఆమెకు ఏం చెప్తుంది అని అడిగితే.. ఎవడికి తెలుసు??