సంక్రాంతి పోరులో మైత్రి వారే కాదు శృతి కూడా నలిగి పోనుందా?

Thu Dec 01 2022 16:18:32 GMT+0530 (India Standard Time)

Shruti Haasan also be Crushed in the Sankranthi Battle

2023 సంక్రాంతికి రాబోతున్న సినిమాల జాబితా ఖరారు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా తో పాటు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న విజయ్ 'వారసుడు' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ రెండు సినిమాలకు రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలను కూడా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ వారే. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి వారు కాస్త ఎక్కువ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు.

ఒకే నిర్మాణ సంస్థ నుండి సంక్రాంతికి రెండు సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మొదట వీర సింహారెడ్డి సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని భావించినా కూడా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సంక్రాంతికి విడుదల చేయాల్సి వస్తుంది. వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల మద్య మైత్రి మూవీ మేకర్స్ వారు నలిగి పోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మాత్రమే కాకుండా హీరోయిన్ శృతి హాసన్ కూడా సంక్రాంతి సినిమాల మధ్య నలిగి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీర సింహారెడ్డి సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే.

సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు మరియు సోషల్ మీడియా హడావుడికి కచ్చితంగా శృతి హాసన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న రెండు భారీ సంక్రాంతి సినిమాల్లో శృతి హాసన్ నటించడం అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ నలిగి పోవుడు నుండి శృతి హాసన్ మరియు మైత్రి వారు ఎలా తప్పించుకుంటారు అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.