Begin typing your search above and press return to search.

ఉడుంప‌ట్టు ప‌ట్టి ఊపిరాడ‌నంత ప‌ని చేసిందిగా!

By:  Tupaki Desk   |   30 July 2021 11:30 AM GMT
ఉడుంప‌ట్టు ప‌ట్టి ఊపిరాడ‌నంత ప‌ని చేసిందిగా!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గారాలప‌ట్టి శ్రుతిహాస‌న్ ప్రేమాయ‌ణాలు నిరంత‌రం హాట్ టాపిక్. తొలుత విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లే తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలింది. ఆ ఇద్ద‌రు ఎంతో స‌న్నిహితంగా మెలిగారు. త‌న తండ్రి గారైన క‌మ‌ల్ హాస‌న్ కి సారిక‌కు ప‌రిచ‌యం చేసింది. అటుపై పెళ్లి చేసుకుని కొత్త‌జీవితాన్ని ప్రారంభించాల‌నుకుంది శ్రుతి. కానీ ఇంత‌లోనే మ‌నస్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డంతో విడిపోయారు. క‌లిసి ఉన్నంత కాలం ఆ జంట జాలీ లైఫ్ .. నిరంత‌రం వార్తల్లో హెడ్ లైన్స్ గా నిలిచింది.

ప్రేమ పేరుతో ప్ర‌పంచ యాత్రలు చుట్టొచ్చిన ఈ జంట స‌న్నిహిత ఫోటోల‌తో నిత్యం సోష‌ల్ మీడియాలో ట‌చ్ లో ఉండేవారు. అయితే ఇప్పుడు శ్రుతి బ్రేక‌ప్ త‌ర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. అత‌డితోనూ శ్రుతి అంతే దూకుడుతో వ్య‌వ‌రిస్తోంది. ఇప్పుడు శంత‌నుతో రొమాన్స్ విష‌యంలో శ్రుతి ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని ఇటీవ‌ల రివీలైన ఫోటోలు చెబుతున్నాయి.

శంత‌ను హ‌జారికా ప్ర‌ఖ్యాత‌ డూడుల్ పెయింటర్.. అత‌డితో శ్రుతి ఇప్పుడు ప్రేమ‌లో ఉంది. హ‌జారిక వెరీ ట్యాలెంటెడ్.. కానీ ఇంతవ‌ర‌కూ అత‌నికి రావాల్సినంత‌ గుర్తింపు రాలేదు. ప్ర‌స్తుతం ముంబైలో ఉంటూనే స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రుతిహాస‌న్ అత‌ని ట్యాలెంట్ ని గుర్తించి ఎంక‌రేజ్ చేస్తోంది. ఇక ఇరువురి అభిరుచులు క‌లిసాక‌ ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ జంట త‌మ డేటింగ్ ని అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌క‌పోయినా.. చేత‌ల‌తో అది ప్రతిసారీ ప్రూవ్ అయింది. ఈసారి కూడా అది రిపీటైంది. ప్రియుడు శంత‌నుని అమాంతం ఉడుము ప‌ట్టి ఊపిరాడ‌నంత ప‌నిచేసింది శ్రుతి.

అంత‌గా ఎగ్జ‌యిట్ అయ్యే మూవ్ మెంట్ ఏమై ఉంటుందో కానీ శ్రుతి హాస‌న్ దూకుడు ఎంత‌మాత్రం మాములుగా లేదు.. ఒక‌ ఫాస్ట్ బౌల‌ర్ మాదిరిగా ప‌రిగెత్తుకుంటు వ‌చ్చి గాల్లోకి ఎగిరి హ‌జారికాను ఉడుంప‌ట్టుప‌ట్టింది. అత‌డి మెడ‌ను చేతుల‌తో చుట్టేసింది. రెండు కాళ్లు ప్రియుడి న‌డుముకి చుట్టేసింది. దీంతో హజారాకి ఒక్క‌సారిగా షాక్ అయిన భావ‌న‌లో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత హజారిక కూడా అంతే గ‌ట్టిగా వాటేసుకున్నాడు. ``భ‌యంతో కూడిన అత‌ని ముఖం చూడండి!`` అంటూ శ్రుతి క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఈ వీడియో శ్రుతి ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. అంతే వేగంగా సోష‌ల్ మీడియా మొత్తం ఆ వీడియో దావానలంలా వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోపై అభిమానులు కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. క్రాక్-వ‌కీల్ సాబ్ లాంటి చిత్రాల త‌ర్వాత శ్రుతిహాస‌న్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రంలోనూ శ్రుతి న‌టిస్తోంది. అటు విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న న‌టించిన సినిమా కూడా రిలీజ్ కి రావాల్సి ఉంది. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం.