Begin typing your search above and press return to search.

ప్రియుడి బుగ్గలు కొరికేస్తూ శ్రుతి హాసన్ రచ్చ.!

By:  Tupaki Desk   |   31 May 2023 4:20 PM GMT
ప్రియుడి బుగ్గలు కొరికేస్తూ శ్రుతి హాసన్ రచ్చ.!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ నటించి అదరగొట్టింది. తాను కేవలం నటిగా మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్. సింగర్ కూడా తన ప్రావీణ్యాన్ని అందరికీ చూపించింది. ఇటీవల టాలీవుడ్ లో రెండు వరస బ్లాక్ బస్టర్ లను కూడా అందుకుంది. రెండు ఒకే టైమ్ లో విడుదల అయినా వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యలు హిట్ కావడంతో శ్రుతి గోల్డెన్ లెగ్ గా మారింది.

ఈ సంగతి పక్కన పెడితే,శ్రుతి ప్రస్తుతం ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా శృతి,శాంతను హజారికా అనే డూడుల్‌ ఆర్టిస్ట్ తో డేటింగ్ లో ఉంది. వీరిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. ముంబయిలో ఓఫ్లాట్‌ తీసుకుని కలిసే ఉంటున్నారు. సినిమా షూటింగ్‌ లేని సమయంలో ప్రియుడితోనే గడుపుతుంది శృతి. తన ప్రియుడితో ఉన్న ఫోటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా శ్రుతి తన ప్రియుడు శాంతను తో కలిసి తనకు ఇష్టమైన నగరానికి వెళ్లిందట. ఆమెకు ఇష్టమైన నగరం లండన్ కాగా, అక్కడ శాంతను తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

అందులో అక్కడికి వెళ్లినందుకు ఆమె ఆనందంగా స్పష్టంగా తెలుస్తోంది. శాంతను బుగ్గలు కొరికేస్తూ రచ్చ చేస్తోంది. అంతేకాకుండా, అక్కడ వీధుల్లో తిరుగుతూ ఆమె ఎంజాయ్ చేస్తూ ఉండటం విశేషం.

కాగా, ప్రస్తుతం శ్రుతి హాసన్ 'సలార్' మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ హీరో కాగా, ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ జూన్ 16న విడుదల కానుండగా, మూవీ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ మూవీపై శ్రుతి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.