సునామీ ముందు తుఫాన్ లా ఏంటిది శ్రీయా?

Wed Jun 09 2021 10:00:01 GMT+0530 (IST)

Shreya Saran Latest Stunning Pose

పెళ్లి తర్వాత గడిచిన మూడేళ్లుగా భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో కలిసి శ్రీయ విదేశీ పర్యటనలతో ఫుల్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. స్పెయిన్ లోనే మూడేళ్లు భర్త  అత్తగారి కుటుంబంతో నివశించిన ఈ బ్యూటీకి ఇక ఆ లైఫ్ చాలని అనిపించిందట.అందుకే ఇప్పుడు ప్లాన్ -బితో బరిలో దిగిపోయిందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. పెళ్లి అనంతరం మూడేళ్ల సెలబ్రేషన్ ని ముగించి ఇప్పుడు ముంబైలో సెటిలవ్వాలని భర్తతో కలిసి శ్రీయ ఇండియాకి వచ్చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ముంబై పరిశ్రమ సహా తెలుగు-తమిళ సినీ ఇండస్ట్రీలపైనా ఈ సీనియర్ నాయిక ట్రిగ్గర్ గురి పెట్టిందట. ఇప్పటికే వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. టూమచ్ హాట్ కంటెంట్ తో అగ్గి రాజేస్తోంది. తాజాగా మరో హాటెస్ట్ ఫోటోషూట్ ని శ్రీయ షేర్ చేయగా వైరల్ గా మారింది. బ్లాక్ హాఫ్ షోల్డర్ టాప్.. షార్ట్ మిడ్డీ ధరించిన శ్రీయ మెంటలెక్కిస్తోంది.

ఇప్పటికే దర్శకనిర్మాతలకు తన వైపు నుంచి అన్నిరకాలుగా ఫీలర్స్ వెళ్లాయి. ఆ ఒక్క ఛాన్స్ రావడమే ఆలస్యం.. దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందనే ఆశిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో ఓ అతిథి పాత్రకు కమిటైన ఈ బ్యూటీ తదుపరి అప్ డేట్ పెద్దగానే ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. జస్ట్ వెయిట్.. !  సునామీ ముందు తుఫాన్ లా కొన్ని క్షణాలు..