Begin typing your search above and press return to search.

థైస్ షోతో మెస్మరైజ్ చేస్తోన్న శ్రద్ధా దాస్..!

By:  Tupaki Desk   |   30 May 2023 3:23 PM GMT
థైస్ షోతో మెస్మరైజ్ చేస్తోన్న శ్రద్ధా దాస్..!
X
బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ తన స్కిన్ షోతో, ఫోటోలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని ఇండస్ట్రీకి వచ్చిన ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ నటించిన అరకొర చిత్రాల్లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.ప్రస్తుతం ఓ టీవీ షోలో జడ్జ్ గా చేస్తూ అలరిస్తోంది.

ఈ బ్యూటీ సినిమా,టీవీ కంటే సోషల్ మీడియాలో చేసే కల్లోలం అంతా ఇంతా కాదు. మామూలుగానే ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేయించుకొని, వాటిని షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటిది వెకేషన్ కి వెళ్లే ఇక ఫోటోలు షేర్ చేయకుండా ఉంటుందా? శ్రద్ధ ఇప్పుడు అదే చేస్తోంది.

సమ్మర్ కావడంతో ఆమె వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న బ్లాక్ కలర్ బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది. తాజాగా మరోసారి తన వెకేషన్ పిక్స్ షేర్ చేసింది. ఈ సారి ఆమె పొట్టి బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ కి, జీన్స్ షార్ట్ ధరించింది. ఈ డ్రెస్ లో ఆమె థైస్ స్పష్టంగా కనపడుతున్నాయి.

ఏదో నీటి కొలనులో ఉన్న బోటులో ఆమె ఉన్నట్లు అర్థమౌతోంది. ఆ డ్రెస్ లో ఆమె ఇచ్చిన ఫోజులు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ ఫోటోలను చూస్తుంటే, వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేస్తోందని అర్థమౌతోంది.

ఏది ఏమైనా ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సూపర్, హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం జడ్జ్ గా చేస్తున్న ఢీ షో ముగియడంతో ఆమె ఈ వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, శ్రద్ధా దాస్ 'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె అందానికి అందరూ ఆకర్షితులయ్యారు. ఆ సినిమాలో ఆమె బోల్డ్ గా కనిపించగా, అప్పటి నుంచి ఆమెకు బోల్డ్ ఛాన్స్ లే వచ్చాయి. ఆర్య2, డార్లింగ్, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో ఆకట్టుకుంది.