Begin typing your search above and press return to search.
'సైంధవ్' తో 'జెర్సీ' బ్యూటీ రొమాన్స్
By: Tupaki Desk | 26 March 2023 2:00 PMవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా శేలేష్ కొలను దర్శకత్వంలో` సైంధవ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతుంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వెంకటేష్ సహా కీలక నటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్ ఉంది. అన్ని కథలో భాగంగా సాగే పాత్రలే. అయితే ఏ పాత్రకి ఎవరెవర్ని ఎంపిక చేస్తున్నారు? అన్న మీమాంస కొనసాగుతుంది. తాజాగా ఆ సస్పెన్స్ తెరపడినట్లు తెలుస్తోంది.
మెయిన్ లీడ్ కి రుహా శర్మిని ఎంపిక చేసారు. ఇక సెకెండ్ లీడ్ కి శ్రద్ధా శ్రీనాధ్ ని తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ పాత్ర సినిమాలో అత్యంతక కీలకంగా ఉండబోతుందిట. ఈ రోల్ ని కాస్త రొమాంటిక్ గానూ డిజైన్ చేసినట్లు సమాచారం. వెంకీతో కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉన్నట్లు గుస గుస వినిపిస్తుంది. అమ్మడి నేచురల్ పెర్పార్మెన్స్ తోనే ఈ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ జెర్సీతో మంచి నటిగా నిరూపించుకుంది. సహజ నటిగా మంచి పేరుంది. ఆ ఇమేజ్ తీసుకొస్తున్న అవకాశంగా భావించొచ్చు. ఇక మూడవ నాయికగా బాలీవుడ్ భామని తీసుకునే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో హిందీ హీరోయిన్ అయితే సినిమాకి అదనంగా కలిసొస్తుందని పేరున్న భామనే తీసుకునే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
వెంకటేష్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో రిలీజ్ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఇక సినిమాపై అంచనాలు ముందు నుంచి భారీగానే ఉన్నాయి. `హిట్` ప్రాంచైజీతో మార్కెట్ లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు శైలేష్. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో శైలేష్ ప్రత్యేకత తొలి సినిమాతోనే రుజువైంది. ఇప్పుడా దర్శకుడికి వెంకీ లాంటి పవర్ ఫుల్ యాక్టర్ దొరకడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయ. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా కీలక పాత్ర పోషించడం సినిమాకి అదనపు అస్సెట్ గా చెప్పొచ్చు.