Begin typing your search above and press return to search.

బికినీలో తకిట తకిట తందానా..!

By:  Tupaki Desk   |   29 May 2023 2:00 PM GMT
బికినీలో తకిట తకిట తందానా..!
X
అందాలతో కుర్రకారుకు ఊపిరాడనివ్వకుండా చేయడంలో శ్రద్ధాస్ ది అందవేసిన చెయ్యి. ఎప్పుడు ఎలాంటి ఫోజులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఆకట్టుకోవాలో ఈమెకు తెలిసినంతగా మరొకరికి తెలియకపోవచ్చు. ఎప్పటికప్పుడు తన అంద,చందాలతో మాయ చేసేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ బికినీలో దర్శనమిచ్చింది. అర్థరాత్రి వేళ బికినీ వేసుకొని, తాను స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్న ఫోటోలను షేర్ చేసింది. నలుపు రంగు బికినీ, చుట్టూ చీకటిలో ఆమె మాత్రం చందమామలా కనిపిస్తోంది. ఒక ఫోటోలో అయితే.. స్విమ్మింగ్ పూల్ ఒడ్డుపై నడుస్తూ కనిపించింది. ఆ ఫోటో చూస్తుంటే సాగరసంగమంలో కమల్ హాసన్ తకిటతదిమి పాట గుర్తుకు వస్తోంది.

ఆ పాట సంగతి పక్కన పెడితే, చీకటిలోనూ శ్రద్ధా అందాలను శ్రద్ధగా చూడాలనిపించేలా ఉన్నాయి. తన థైస్ తో సహా సోకులన్నీ కనిపించేలా ఆమె విందు చేస్తుండేలా ఈ ఫోటోలు ఉండటం విశేషం.ఇప్పుడు ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా, హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. చెప్పుకోవడానికి చాలా సినిమాలే చేసినా, ఏదీ పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలు చేసింది.

'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె అందానికి అందరూ ఆకర్షితులయ్యారు.కానీ హీరోయిన్ ఛాన్స్ లు మాత్రం రాలేదు. ఆ సినిమా నుంచి ఆమెకు అన్నీ బోల్డు పాత్రలే దక్కాయి.

ప్రభాస్ డార్లింగ్, అల్లు అర్జున్ ఆర్య2 వంటి చిత్రాల్లో మంచి పాత్రలే దక్కాయి. ఇటీవల రీసెంట్ ఏక్ మినీ కథ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో కనిపించకపోవడం గమనార్హం.

ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అలరిస్తూ, ప్రముఖ టీవీ లో డ్యాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఆ షోకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.