Begin typing your search above and press return to search.

ఎంతపని చేసింది.. శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదా?

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:23 AM GMT
ఎంతపని చేసింది.. శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదా?
X
శ్రీరెడ్డి.. ఈ వివాదాస్పద నటీమణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. టాలీవుడ్ సెక్స్ బాగోతాలు బయటపెట్టి సంచలనం సృష్టించింది. కొందరు హీరోయిన్లు నిర్మాతలకు లొంగిపోయి సినిమా అవకాశాలు దక్కించుకున్నారని ఆరోపించింది. తాను బాధితురాలినే అని కుండబద్దలు కొట్టింది. తెలుగు సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ ను బయటపెట్టి దుమారం రేపింది. అగ్రనిర్మాత కొడుకు, తెలుగు హీరో, తమిళ హీరోలు తనను అవకాశాల కోసం వాడుకున్నారని చెప్పి సంచలనం సృష్టించింది. ఇంకా చాలా మంది సినీ ప్రముఖుల బాగోతాలను బట్టబయలు చేసింది.

అయితే శ్రీరెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ తో ఎందుకు పెట్టుకోవాలని చాలా సినీ ప్రముఖులు మౌనంగా రోదించారు. కొంతమంది ధైర్యం చేసి అప్పుడే పోలీస్ కేసులు కూడా పెట్టారు. తెలుగులో టాప్ హీరోల్లో ద్వితీయ శ్రేణి హీరో అప్పట్లో శ్రీ రెడ్డిపై కేసు పెట్టారు. తనను వాడుకున్నాడని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఆయన కేసు నమోదు చేయించారు.

తమిళ నటుటు శ్రీకాంత్, రాఘవ లారెన్స్ తనకు అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేశారని అప్పట్లో చెన్నై వెళ్లి తమిళ లీక్స్ కలకలం సృష్టించింది. తమిళ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ ను శ్రీరెడ్డి బయటపెట్టి పలువురి పేర్లను విడుదల చేసింది. ఈ కోవలోనే ప్రముఖ నటి కుష్బూ భర్త సుందర్ సిపై శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వారందరూ చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పుడా కేసులన్నీ శ్రీరెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయని సమాచారం. స్టార్స్ జీవితాలను కుదిపేసిన శ్రీరెడ్డి వారి మంచి ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. అందులో నిజం ఉందో లేదో కానీ ఇండస్ట్రీ లో మంచి పేరు ఉన్న తమిళ హీరో విశాల్, సుందర్ సి సహా తెలుగు హీరోలను బుక్ చేసింది. వారిని కృంగదీసింది. అలాంటి ఆమె నోటి దురుసుతనం కారణం గా ఆనాడే కేసులు పెట్టారు. ఇప్పుడా కేసుల్లో శ్రీరెడ్డి అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సినీ వర్గాలు, పోలీసు వర్గాలు కూడా శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదు అంటూ అభిప్రాయ పడుతున్నాయట..

సోషల్ మీడియానే ఆయుధంగా.. వేదికగా మార్చుకొని రెచ్చి పోతున్న శ్రీరెడ్డి మరి ఈ అరెస్ట్ తోనైనా తన తీరు మార్చుకుంటుందా? లేక తనకు జరిగిన అన్యాయంపై మరింత గళమెత్తుతూ మరింత రెచ్చిపోతుందా అన్నది వేచిచూడాలి.