అమీర్ ఖాన్ తో షూట్.. కార్గిల్ -లడఖ్ కి నాగచైతన్య?

Mon May 03 2021 12:00:01 GMT+0530 (IST)

Shoot with Aamir Khan .. Naga Chaitanya for Kargil-Ladakh?

కరోనా క్రైసిస్ వల్ల వాయిదాల ఫర్వంలో షూటింగులు సాగుతున్నాయి. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇక వెయిట్ చేయదలుచుకోలేదు. ఆయన ఫారెస్ట్ గంప్ హిందీ రీమేక్ లాల్ సింగ్ చద్దా పెండింగ్ చిత్రీకరణను లఢక్ (హిమచల్ ప్రదేశ్) లో ప్రారంభించనున్నారు. భూమికి  దాదాపు 7700 మీటర్లు (25000 అడుగులు) ఎత్తున ఉన్న హిమానీ పర్వత శ్రేణుల ప్రదేశమిది.ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారన్న గుసగుసలు వున్నాయి. అయితే దీనిపై నాగ చైతన్య లేదా అమీర్ ఖాన్ బృందం నుండి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విజయ్ సేతుపతి స్థానంలో చైతూ నటిస్తాడని చెబుతున్నారు.

తాజా సమాచారం మేరకు..  కార్గిల్ మరియు లడఖ్ లలో కీలక భాగం చిత్రీకరించడానికి లాల్ సింగ్ చద్దా బృందం ప్లాన్ చేస్తోంది.45 రోజుల పాటు సాగే ఈ షూట్ లో నాగ చైతన్య టీమ్ తో చేరాలని భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

మరోవైపు నాగ చైతన్య తన తదుపరి తెలుగు చిత్రం థాంక్స్ చిత్రీకరణ కోసం ఇటీవల ఇటలీకి వెళ్లారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా కథానాయిక. కోవిడ్ -19 రెండవ వేవ్ కారణంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అతని తదుపరి విడుదల లవ్ స్టోరీ వాయిదా పడింది.