ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చండి!-కంగన

Tue Sep 29 2020 17:20:33 GMT+0530 (IST)

Shoot these rapists in public Kangana

దిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సామూహిక అత్యాచార బాధితురాలుకి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కంగన రనౌత్ `రేపిస్టులను ఉరి తీయాల`ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్వీన్ డిమాండ్ చేసారు.నటి కంగనా రనౌత్ తరచూ మహిళల సమస్యలపై ముందుకు వచ్చి పలు విషయాలపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా మాట్లాడారు. హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసుపైనా కంగన గట్టి వైఖరిని ఎంచుకుంది.    బాధితురాలు దిల్లీ ఆసుపత్రిలో మరణించిన తరువాత ఆ ఘోరకృత్యాన్ని ఖండించింది. యుపిలో 19 ఏళ్ల యువతిపై హత్రాస్ (ఉత్తరప్రదేశ్) గ్యాంగ్ రేప్ సంఘటనపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనల పెరుగుదలను కూడా కంగన ప్రశ్నించింది.

ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చండి.. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి? ఈ దేశానికి ఎంత విచారకరమైన  సిగ్గుపడే రోజు. వ్యవస్థ విఫలమైంది. ఈ ఘటనకు కారకులైన నిందితులను అస్సలు తప్పించవద్దని ఉరి తీయాలని యువతి సోదరుడు డిమాండ్ చేసిన సంగతి తెలిసినదే.

ఈ రోజు కంగనా మాత్రమే కాదు.. బాధితురాలికి న్యాయం చేయాలని దేశం కోరింది. ఈ సంఘటనను సోషల్ మీడియాలో ఖండించడానికి రిచా చద్దా.. యామి గౌతమ్ వంటి అనేక మంది తారలు కూడా ముందుకు వచ్చి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తరువాత.. బాధితురాలిని చికిత్స కోసం దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ సంఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన బాధితురాలికి న్యాయం చేయాలని చాలా మంది ట్విట్టర్ లో కోరుతున్నారు.