'అఖండ' హీరోయిన్ గురించి అంతా షాక్ అయ్యే విషయం!

Sat Oct 23 2021 17:07:21 GMT+0530 (India Standard Time)

Shocking thing about Pragya Jaiswal going viral on social media

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లుగా ఇటీవలే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. కంచె సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్ కు ఆ తర్వాత అంతగా ఆఫర్లు దక్కలేదు. వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్న ప్రగ్యా జైస్వాల్ మొదటి సారి బాలయ్య వంటి స్టార్ హీరో సినిమాలో ఆఫర్ దక్కడంతో ఇక ముందు అంతా కూడా ఫుల్ బిజీగా ఉంటాననే నమ్మంకతో ఉంది. ఈ ప్రగ్యా జైస్వాల్ గురించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతోంది.ప్రగ్యా జైస్వాల్ గురించి కాస్త సినిమా జ్ఞానం ఉన్న ఏ ఒక్కరిని ప్రశ్నించినా కూడా ఆమె మొదటి సినిమా కంచె అంటారు. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాకు గాను ఆమెకు అవార్డు కూడా వచ్చింది. అందంతో పాటు మంచి నటనతో ఆ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ మెప్పించింది. ప్రగ్యా జైస్వాల్ మొదటి సినిమా కంచె అంటూ ఇండస్ట్రీలో కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాని చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే ప్రగ్యా జైస్వాల్ అంతకు ముందే రెండు సినిమాల్లో నటించింది.

ఆమె నటించిన సినిమాలు కూడా ఇతర భాషల్లో చేసినవి అస్సలు కాదు.. ఆ రెండు కూడా తెలుగు లో ఆమె నటించినవే. తెలుగు లో ప్రగ్యా మొదటగా డేగా సినిమాలో నటించగా ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి కాని జనాలు పెద్దగా వీటిని పట్టించుకోలేదు. దాంతో ఈమెకు ఆ సినిమాలు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కాని ఈ సినిమాలో క్రిష్ దృష్టిలో ఈమె పడేలా చేశాయి. ఈ రెండు సినిమాల గురించి ఆమె ఎప్పడు పెద్దగా మాట్లాడలేదు. అందుకే జనాలు ఆమె మొదటి సినిమా కంచె అనుకుంటున్నారు.