Begin typing your search above and press return to search.
ఫ్యాన్ ఫోన్ లాక్కొని విసిరేసిన రణ్‌బీర్
By: Tupaki Desk | 27 Jan 2023 1:50 PMతమకిష్టమైన హీరో హీరోయిన్లు, నటీనటులు కనపడితే ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించడం, అదే సమయంలో వారి ప్రవర్తన వల్ల సదరు స్టార్స్ విసుగు చెందటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అలానే మరి కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ మాములుగానే ఉన్నా.. స్టార్సే వారిపై అనవసరమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో వారు విమర్శలకు గురౌతుంటారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన కనపడితే చాలు ఫ్యాన్స్ ఆయన్ను చుట్టుముడుతుంటారు. అయితే తాజాగా ఆయన ఒక అభిమాని ప్రవర్తన కారణంగా విసుగు చెందారు. అతని మొబైల్ ఫోన్‌ను లాక్కొని విసిరేశారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు ఓ పబ్లిక్ ప్లేస్‌లో రణ్‌బీర్ ఉండగా.. ఆయనతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు.
అయితే మొదట బాగానే ఫొటోలు దిగిన రణ్‌బీర్ ఆ తర్వాత సహనం కోల్పోయాడు. ఎందుకంటే సదరు ఫ్యాన్స్.. ఫొటో దిగే సమయంలో ఆ పిక్ సరిగ్గా వచ్చినట్టు లేదు. దీంతో అతడు రణ్‌బీర్‌ను వెళ్లనివ్వకుండా మళ్లీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన రణ్‌బీర్.. ఆ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కొని విసిరేశాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అది కాంట్రవర్సీగా మారింది. కొంతమంది నెటిజన్లు రణ్‌బీర్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. అలా చేయడం సరికాదని అంటున్నారు.
కాగా, రణ్‌బీర్ తన భార్యతో కలిసి నటించిన 'బ్రహ్మాస్త్రం'తో సూపర్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం రెండో పార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అలాగే ఇటీవలే ఆయన హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ తూ ఝూఠీ.. మై మక్కార్ ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు లవ్ రంజన్ తెరకెకిస్తోన్న ఈ సినిమా హోలీ పండగ సందర్భంగా మార్చి 8న విడుదలవుతోంది. ఆకట్టుకునే దృశ్యాలు, హీరోహీరోయిన్ల మధ్య సరదాగా నడిచే రొమాన్స్, నవ్వు తెప్పించే సంభాషణలతో ట్రైలర్ కళ్లకు ఇంపుగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.