షాక్ ఇస్తున్న హంట్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్!

Fri Jan 27 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Shocking Hunt Movie First Day Collections

సుదీర్ బాబు హీరోగా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం హంట్. సీనియర్ హీరో వెంకటేష్. తమిళ్ హీరో భరత్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అలాగే సుదీర్ బాబు కెరియర్ లో యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమా కావడంతో కొంత బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్ కూడా గట్టిగానే చేశారు. ఇక మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది.సుదీర్ బాబు భరత్ ఎంతగా ప్రమోషన్ చేసిన సినిమాని జనాల్లోకి బలంగా పంపించలేకపోయారు. ఈ నేపధ్యంలో మొదటి రోజు నుంచి వస్తున్న నెగిటివ్ టాక్ తో సినిమా కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయని చెప్పాలి.

ఇక ఈ సినిమా 4.10 కోట్ల బిజినెస్ జరిగింది. 4.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పూర్తిగా తేలిపోయిందని చెప్పాలి. ఈ సినిమా షేర్ పరంగా చూసుకుంటే ఈ మూవీ పూర్తిగా చతికిలపడింది అనే మాట వినిపిస్తుంది.

ఎంతగా ప్రమోషన్ చేసిన కూడా హంట్ మూవీపై బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని దీనిని బట్టి అర్ధమవుతుంది.

మొదటి రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కేవలం కంటెంట్ బాగుంటే తెలిసిన నటులు లేకపోయిన కూడా సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయని కాంతారా సినిమా ప్రూవ్ చేస్తే. స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా కంటెంట్ లో దమ్ము లేకపోతే మాత్రం సినిమా కలెక్షన్స్ రాబట్టడం చాలా కష్టం అని హంట్ మూవీ ఇప్పుడు ప్రూవ్ చేసిందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.

ఎంతో హోప్స్ పెట్టుకొని చేసిన ఈ సినిమాని ఏ యాంగిల్ లో కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా  డిజాస్టర్ అయిన కూడా 18 నుంచి 20 లక్షల షేర్ ని మొదటి రోజు రాబట్టింది. అయితే హంట్ మూవీ మాత్రం ఆ మాత్రం షేర్ ని రాబట్టడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యిందని తెలుస్తుంది. ప్రయోగాత్మక కథ అని చేసిన కూడా ఆ ఫీల్ ని జనాల్లోకి పంపించలేకపోవడం కూడా ఈ మూవీ డిజాస్టర్ కి ఒక కారణం అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.