షాక్: మరో సౌందర్య అని పిలిచాడట

Sun Jun 13 2021 13:00:02 GMT+0530 (IST)

Shock: Called another beauty

టాలీవుడ్ లో వరుసగా గ్లామరస్ పాత్రలతో యువతరం హృదయాల్ని దోచింది మెహ్రీన్ ఫీర్జదా. నవతరం హీరోల సరసన ఈ అమ్మడు హాట్ కంటెంట్ తో విరుచుకుపడుతున్న తీరు తెలిసినదే. ఎఫ్ 3లో హనీ పాత్రతో బాగానే కనెక్టయ్యింది.అయితే ఈ భామ ఇమేజ్ తో సంబంధం లేకుండా ``మరో తెలుగు సినిమా సౌందర్య`` అంటూ ఒక సీనియర్ నటుడు పొగిడేశారట. ఆయనేదో ముఖస్థితికి అనేశారా ?  లేక నిజంగానే హృదయం నుంచి వచ్చిందా?  ఏమో కానీ మెహ్రీన్ కి అంత సీనుందా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మెహ్రీన్ త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారీ సోకడం ఇతరత్రా కారణాలతో ఈ పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి ఎఫ్ 3 చిత్రీకరణ సహా మారుతి తెరకెక్కిస్తున్న మూవీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలిసింది. సంతోష్ శోభన్ ఇందులో హీరో. త్వరగా చిత్రీకరణలు పూర్తయితే పెళ్లి తర్వాత నటించే ఆలోచన కూడా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ ను మెహ్రీన్  పెళ్లి చేసుకోనుంది.