Begin typing your search above and press return to search.

విశాఖ‌లో 'ఖుషీ'..సెంటిమెంట్ గానా శివ‌?

By:  Tupaki Desk   |   7 July 2022 8:30 AM GMT
విశాఖ‌లో ఖుషీ..సెంటిమెంట్ గానా శివ‌?
X
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖుషీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌శ్మీర్..హైద‌రాబాద్ లో రెండు షెడ్యూళ్ల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. దీనిలో భాగంగా సామ్ -విజ‌య్ స‌హా ప్ర‌ధాన తారాణ‌పై ంకీల‌క స‌న్నివేశాలు షూట్ చేసారు. కశ్మీర్ షెడ్యూల్లో జంట‌పై కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

సినిమాలో ఆ సన్నివేశాలు ఆద్యంతం యువ‌త‌ని ఆక‌ట్టుకునేలా? ఉంటాయ‌ని తెలుస్తోంది. శివ మార్క్ ల‌వ్ బుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న 'ఖుషీ' తాజాగా త‌దుప‌రి షెడ్యూల్ కి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా విశాఖ‌లో కీల‌క షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్ లో సామ్-విజ‌య్ పై ఓ రొమాంటిక్ విర‌హ‌గీతాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిసింది.

విశాఖ బీచ్ అందాలు స‌హా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆ పాట చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని స‌మాచారం. పాట‌లో రొమాంటిక్ స‌న్నివేశాల్లో నాయ‌కా-నాయిక‌లు రియ‌లిస్టిక్ గానే రొమాన్స్ పండిచ‌నున్నార‌ని తెలుస్తుంది. స‌న్నివేశం పండాలంటే? రియాల్టీ త‌ప్ప‌ని స‌రిలో భాగంగా శివ క్రియేటివిటీకి అనుగుణంగానే స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తోంది.

ఇక విశాఖ‌లో షూటింగ్ అంటే శివ కి ఎంతో ప్ర‌త్యేకం. ఆయ‌న ప్ర‌తీ సినిమాలో ఓ షెడ్యూల్ త‌ప్ప‌నిస‌రిగా విశాఖ‌లో ప్లాన్ చేస్తుంటారు. ఆయ‌న గ‌త సినిమాలు 'నిన్నుకోరి'..'మ‌జిలీ' షూటింగ్ ఎక్కువ భాగం దాదాపు విశాఖ‌లోనే జ‌రిగింది. ఆ రెండు సినిమాలు పెద్ద విజ‌యం సాధించాయి. ఇప్పుడు మ‌రోసారి అదే సెంటిమెంట్ గా 'ఖుషీ' ఓ షెడ్యూల్ని విశాఖ‌లో చేస్తున్నారు. సినిమాలో ఈ స‌న్నివేశాలు..పాట హైలైట్ గా ఉంటుంద‌ని స‌మాచారం.

ఆ ర‌కంగా విశాఖ సెంటిమెంట్ తో పాటు.. సొంత జిల్లా ప్రాధాన్య‌త‌ని శివ చాటుతున్నాడు శివ‌. ఆయ‌న స్వ‌స్థ‌లం విశాఖ అన్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ కాక‌ముందు బీఈడీ చేసి విశాఖ‌ స్కూల్లో పాఠాలు చెప్పిన మాష్టారు ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత టీచ‌ర్ వృత్తికి దూర‌మ‌య్యాడు.

త‌న‌లో ఆ ఫ్యాష‌న్ ని 'నిన్నుకోరి' చిత్రంలో ఓ సన్నివేశంలో నాని ని ట్యూష‌న్ మాష్టారు చూపించారు. అలా డెబ్యూమూవీతోనే టీచ‌ర్ వృత్తిపై త‌న ఫ్యాష‌న్ చాటుకున్నాడు. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత విశాఖ‌పై త‌న ప్రేమ‌ని ఇలా షూట్ రూపంలో చాటుతున్నాడు.