ఖుషి కోసం స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్న దర్శకుడు

Fri Mar 31 2023 09:48:24 GMT+0530 (India Standard Time)

Shiva Nirvana Planning Big For Kushi Film

సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లవ్ స్టోరీ గా వస్తున్న మూవీ ఖుషి. గత ఏడాది ఆరంభంలోనే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ సమంత హాస్పిటలైజ్ కావడంతో పోస్ట్ పోన్ అయింది. మరల చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది మార్చిలో షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో కొద్దిరోజులు షూటింగ్ చేసిన దర్శకుడు శివ నిర్వహణ ఇప్పుడు కేరళలోని అలెప్పికి వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. అలెప్పి లోని ఒక లేక్ విజువల్ షేర్ చేసి ఖుషి మూవీ షూటింగ్ కోసం వచ్చినట్లుగా కన్ఫామ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో పై విజయ్ దేవరకొండ అభిమానులు ఇంట్రెస్టింగ్ గా కామెంట్ చేస్తూ ఉండడం విశేషం.

 ఈ సినిమా హిట్ కావాలని కొందరు పోస్టులు పెడుతుండగా మరి కొందరు సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ దర్శకుడు శివ నిర్వాణని ప్రశ్నిస్తున్నారు. లైగర్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న  మూవీ ఇదే కావడంతో అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

కచ్చితంగా సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. సమంత కూడా చాలా గ్యాప్ తర్వాత ఫిమేల్ సెంట్రిక్ కథల నుంచి పక్కకు వచ్చి ఒక లవ్ స్టోరీ మూవీలో నటిస్తూ ఉంది. మజిలీ సినిమా తర్వాత శివనిర్వాణ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు కూడా గట్టిగానే ఉంది.

ఇక పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉండడం విశేషం. మరోవైపు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నారు.

ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కి డేట్ రెడీ అవుతుంది. ఈ సినిమాపై సమంత చాలా హోప్స్ పెట్టుకుంది. ఎలా అయిన బ్లాక్ బస్టర్ కొట్టాలని గట్టిగా ప్రమోషన్ చేస్తూ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.