షాకింగ్ నిజం.. పోలీసుల ఎదుట భర్తతో శిల్ప గొడవ పడ్డారట

Mon Jul 26 2021 10:38:24 GMT+0530 (IST)

Shocking Shilpa clashed with her husband in front of the police

బూతు సినిమాల నిర్మాణానికి సంబంధించి బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించటం తెలిసిందే. అనంతరం కోర్టులో ఆయన్ను మరింత లోతుగా విచారించేందుకు వీలుగా తమ కస్టడీలో ఉంచుకోవటానికి పోలీసులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాను విచారణలో భాగంగా చోటు చేసుకున్న పరిణామాలు నాటకీయంగా చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఈ అంశాలు ఇప్పుడు షాకింగ్ గా మారినట్లు తెలుస్తోంది.రాజ్ కుంద్రా చేసిన తప్పుడు పనులకు సంబంధించి వివరాలు సేకరించేందుకు.. మరింత సమాచారాన్ని తీసుకునేందకు వీలుగా శిల్పాశెట్టిని విచారణకు పోలీసులు పిలిచారు. దీంతో.. పోలీసుల వద్దకు వెళ్లిన ఆమె.. దాదాపు ఆరు గంటల పాటు పోలీసుల ప్రశ్నాస్త్రాల్ని ఎదుర్కోవాల్సి వచ్చినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురి కావటమే కాదు.. పెద్ద ఎత్తున ఏడ్చేసినట్లు చెబుతున్నారు. భర్త తప్పుడు పనుల గురించి పోలీసులు ప్రశ్నలు వేసిన సమయంలో తనకు ఎలాంటి విషయాలు తెలీవని కన్నీళ్లు పెట్టుకోవటంతో పోలీసుల్ని కాస్తంత కన్ఫ్యూజన్ కు గురి చేసినట్లుగా సమాచారం.

అదే సమయంలో.. పోలీసులకు శిల్పా ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. తొలుత అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి భర్తను సమర్థించిన శిల్పా.. పోలీసుల వేస్తున్న ప్రశ్నలతో ఆమె భర్త మీద కాసింత అనుమానంతో రివర్సులో ప్రశ్నలు వేసినట్లుగాచెబుతున్నారు. మొదట్లో రాజ్ కుంద్రాను సమర్థించిన శిల్పా విచారణ జరిగిన కాసేపటికి.. బూతు సినిమాల నిర్మాణంలో తన భర్త పాత్ర నిజంగానే ఉందా? అని ఆరా తీసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని అధికారుల్ని శిల్పా పదే పదే అడిగినట్లుగా తెలుస్తోంది.

ఈ ఉదంతంతో తన ఇమేజ్ దారుణంగా దెబ్బ తిన్నదని.. పలు ఒప్పందాలు వెనక్కి వెళ్లిపోయినట్లుగా ఆమె పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా తాను తీవ్రంగా నష్టపోయినట్లుగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా రాజ్ కుంద్రాను వారి నివాసానికి పోలీసులు తీసుకెళ్లి.. సోదాలు జరిపినట్లుగా తెలుస్తోంది ఈ సందర్భంగా భర్తతో శిల్ప గొడవ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి రెండు మూడు రోజులకు.. ఆదివారం నాటికి పరిణామాల్లో చాలానే మార్పు వచ్చినట్లుగా బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భర్త అరెస్టు అనంతరం కాస్త ఆలస్యంగా రియాక్టు అయిన శిల్పా తాజాగా చేసే పోస్టుతో ఆమె మైండ్ సెట్ తెలిసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఈ ఎపిసోడ్ లో రాజ్ కుంద్రా బుక్ అయినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.