ఇన్ స్టా క్వీన్ ఉన్నట్టుండి ఇలా చేస్తే ఎలా?

Fri May 13 2022 13:04:39 GMT+0530 (IST)

Shilpa Shetty Takes Break From Social Media

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ విషయాలతో పాటు అప్పుడప్పుడు యోగా..ఫిట్ నెస్ వీడియోలతో  సహా హీటెక్కించడం శిల్పా  శెట్టి ప్రత్యేకత. ఆమె ఖాతాకి  25.3 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారంటే? అదంత ఈజీగా వచ్చిన ఇమేజ్ కాదు. దానికి  వెనుక ఎంతో కష్టం ఉంది. తన టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తుంది.అందుకోసం  భారీగా జీతాలు సైతం వెచ్చించి ముందుకెళ్తుంది. ఆ మధ్య భర్త రాజ్ కుంద్రా జైలుకెళ్లిన నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఇన్ స్టా కి దూరమైంది. ఈ క్రమంలో ఖాతా యాక్టివిటీ పై కొంత  ప్రభావం పడింది. అప్టేడేట్  లు లేకపోవడంతో ఖాతాలో క్లోజ్ చేస్తుందా? అన్న సందేహాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ యాక్టివిటీ మొదలు పెట్టిది.

తాజాగా శిల్ప మరోసారి బాంబ్ పేల్చింది. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఇన్ స్టా ఖాతాకి బ్రేక్ ఇస్తున్నాని తెలిపింది. ఒకరకమైన  యాక్టివిటీ నాకు బోర్ కొడుతుంది. అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. కొత్త అవతార్ ని కనుగొనేంత వరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని రాసుకొచ్చింది. దీంతో శిల్పా శెట్టి అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.

మళ్లీ రీచార్జ్ అయ్యేసరికి ఎంత సమయం పడుతుంది? అప్పటివరకూ నిన్ను చూడకుండా ఉండలేం? అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. అలాగే శిల్ప కొత్త అవతార్ ఎలా ఉండబోతుందని? అన్వేషణ మొదలు పెట్టారు. శిల్పా శెట్టి ఎక్కువగా తన ఇన్ స్టా ఖాతాలో ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తుంటుంది. ఇటీవలే మదర్స్ డే సందర్భంగా కుమారుడు వియాన్..కుమార్తె సమీషాతో కూడిన ప్రేమ పూర్వక పోస్ట్ ను షేర్  చేసింది.  ఆ తర్వాత మళ్లీ  కొత్త పోస్ట్ తో అభిమానుల్ని ఊసురుమనిపించింది.

శిల్పా శెట్టి కెరీర్ విషయానికి వస్తే రోహిత్  శెట్టి  దర్శకత్వంలో `ఇండియన్ పోలీస్ పోర్స్` అనే  ఓ వెబ్ సిరీస్ లో నటలిస్తోంది. ఇందులో వివేక్ ఒబెరాయ్..సిద్దార్థ్ మల్మోత్రా హీరోలుగా నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.  అలాగే వెండి తెరపై `నికామ్`..`సుఖీ` చిత్రాల్లో నటిస్తోంది.  `ఇండియాస్ గాట్ ట్యాలెంట్ -9`  టీవీ షోకు హోస్ట్ గానూ బాధ్యతలు వహిస్తుంది.