బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..!

Thu Sep 12 2019 12:54:08 GMT+0530 (IST)

Shilpa Chakravarthy May Be Eliminated From Bigg Boss House

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మొదలై ఇప్పటికి విజయవంతంగా 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. ప్రతి వీకెండ్ లో నాగార్జున ఎంట్రీ ఇస్తున్నాడు అంటేనే హౌస్ లోని కంటెస్టెంట్లలో టెన్షన్ మామూలుగా ఉండటం లేదు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ బిగ్ బాస్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంత కలిసి వచ్చినట్టు లేదు. తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి రెండో వారానికే ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఇప్పుడు రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన శిల్పా చక్రవర్తి కూడా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. హేమ - టీవీ 9 జాఫర్ - తమన్నా సింహాద్రి - రోహిణి - అషు రెడ్డి బయటికి వెళ్లారు. ఈ వారం ఎలిమినేషన్‌కు ఐదుగురు బిగ్ బాస్ ఇంటి సభ్యులు శిల్పా చక్రవర్తి - మహేశ్ విట్టా - పునర్నవి భూపాళం - హిమజ - శ్రీముఖి నామినేట్ అయ్యారు. రవి కృష్ణ కూడా ఎలిమినేషన్ అయినా కెప్టెన్ హోదాలో బాబా భాస్కర్ కు ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ రావడంతో రవిని సేవ్ చేశాడు.

ఇక ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లో శిల్పా చక్రవర్తి - పునర్నవి భూపాలం - హిమజ - శ్రీముఖి - మహేష్ విట్టా ఉన్నారు. వీరిలో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూస్తే శ్రీముఖి - హిమజ బాగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. మహేష్ విట్టా - పునర్నవి కంటే శిల్పా చక్రవర్తి తన డల్ పెర్పామెన్స్ తో అందరికి షాక్ ఇస్తున్నారు. ఇక హౌస్ లో కూడా ఎక్కువ మంది ఆమెకు యాంటీగా మారిపోయారు. ఈ వారం ఆమె నామినేషన్ కు ఎంపిక కావడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం.

ఇక బయట కూడా ఆమెకు ఎక్కువ మంది ఓట్లు వేసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా శిల్పానే ఎలిమినేట్ అవుతుందంటోంది. మరోవైపు ఆదివారం రోజు ఎలిమినేట్ అయిన అలీ రేజా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో ?  చూడాలి.