Begin typing your search above and press return to search.

మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ స్ట్రీమింగ్‌ షురూ

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:34 AM GMT
మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ స్ట్రీమింగ్‌ షురూ
X
కరోనా కారణంగా థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ కాని కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. గత ఏడాది విద్యాబాలన్ నటించిన సినిమా శకుంతల దేవి అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యా బాలన్‌ నటించిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ షేర్ని కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ లోనే ఈ సినిమా ను నేటి నుండి స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు. విద్యా బాలన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించిన ఈ సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ మొదలు అయ్యింది.

అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇప్పటికే చూసిన నెటిజన్స్‌ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. విద్యా బాలన్ నటనతో పాటు అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వం చాలా బాగుందంటూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విషయాలు నెట్టింట ట్రెండ్డింగ్‌ అవుతున్నాయి. మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ అయిన షేర్ని కథనం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. సింపుల్‌ కథ అయినా కూడా దర్శకుడు ఆ కథను నడిపిన తీరు బాగుందంటూ టాక్ వినిపిస్తుంది.

విద్యా బాలన్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే కోట్ల వసూళ్లను సాధించేది అంటూ ట్రేడ్ నిపుణులు కూడా అంటున్నారు. విద్యా బాలన్ తో పాటు ఈ సినిమా లో విజయ్ రాజ్‌ మరియు నీరజ్‌ కబీ లు కీలక పాత్రలో నటించారు. విద్యా బాలన్‌ లుక్ తో పాటు ఆమె ఎమోషనల్‌ సీన్స్ లో నటించిన తీరు గురించి నెట్టింట ప్రస్తుతం చర్చ జరుగుతోంది.