Begin typing your search above and press return to search.

సుశాంత్ ప్రియురాలిని అరెస్ట్ చేయాల‌న్న ఫ్రెండు

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:33 PM GMT
సుశాంత్ ప్రియురాలిని అరెస్ట్ చేయాల‌న్న ఫ్రెండు
X
సుశాంత్ సింగ్ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయడంపై రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ లతో సోషల్ మీడియా నిండిపోయింది. సుశాంత్ స‌హన‌టుడు శేఖర్ సుమన్ ఈ వివాదంపై ట్వీట్ చేసి రియాను అరెస్టు చేయాలని డిమాండ్ చేయ‌డం వేడెక్కిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్వస్థలమైన బీహార్‌కు చెందిన శేఖర్ ``రియా అబ్ రియా నహీ హో శక్తి. # అరేస్ట్‌రియాచక్రవర్తి`` అంటూ కోపాద్రిక్తుడ‌య్యాడు.

సుశాంత్ ని హ‌త్య చేశార‌న్న కొద్దిమంది నటులలో శేఖర్ సుమన్ కూడా ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అంటూ చూపించిన దానికంటే ఇండ‌స్ట్రీలో చాలా ఎక్కువ విష‌యాలున్నాయ‌ని ఆయ‌న ‌ ఆరోపించారు. దీనిపై సిబిఐ దర్యాప్తును అత‌డు డిమాండ్ చేస్తూ సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

బుధవారం నాడు.. శేఖర్ సుమ‌న్ మరికొన్ని వ‌రుస‌ ట్వీట్లు చేసాడు.``దుర్వాసనతో కూడిన రాజకీయ ఇంబ్రోగ్లియో`` గా ఈ కేసు మారిందని ఆయన ట్వీట్ల‌లో పేర్కొన్నారు. దీనిపై విసుగొస్తుంద‌ని అన్నాడు. ``వ్య‌వ‌స్థ మొత్తం దుర్వాసన.. దుర్మార్గం.. ప్రతీకార వికారం.. రాజకీయ ఇంబ్రోగ్లియోగా మారింది. ఉత్తమమైన వాటి కోసం ఆశతో ఉండండి`` అంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. జస్టిస్ ఫ‌ర్ సుశాంత్ సింగ్ అంటూ నిన‌దించారు. మీరు(సుశాంత్) చనిపోయారని లేదా మీరు హత్యకు గురయ్యారని నిర్ధారించుకున్నా దీనిలో విజయవంతమయ్యారు అంటూ త‌న‌లోని ఆవేద‌న‌ను శేఖ‌ర్ సుమ‌న్ ట్వీట్ల ద్వారా వ్య‌క్త‌ప‌రిచారు. పోలీసులే కాదు ఎవరైనా దీన్ని అంగీకరించాల‌ని శేఖ‌ర్ సుమన్ అన్నారు.

తాజా విచార‌ణ అనంత‌రం.. సుప్రీంకోర్టు సుశాంత్ కేసుపై తీర్పును రిజర్వు చేసింది. గురువారం నాటికి సంక్షిప్త లిఖితపూర్వక స‌మాచారాన్ని సమర్పించాలని ఈ కేసుపై మాట్లాడుతున్న‌ అన్ని రాజ‌కీయ పార్టీలను కోరింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న తన బాంద్రా నివాసంలో చనిపోయినట్లు గుర్తించారు. అంతకుముందు ఇది ఆత్మహత్య అని పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే సీబీఐ దర్యాప్తుతో, ఈ కేసులో అనేక కోణాలు తెరపైకి వస్తున్నాయి. ప‌లువురు పెద్ద‌లు తెర‌వెన‌క ఆడించిన నాట‌కం బ‌య‌ట‌ప‌డేందుకు ఆస్కారం ఉంద‌ని సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.