Begin typing your search above and press return to search.

ఆఫ‌ర్లు లేక పోకిరి పిల్ల విల‌విల‌

By:  Tupaki Desk   |   3 April 2020 7:10 AM GMT
ఆఫ‌ర్లు లేక పోకిరి పిల్ల విల‌విల‌
X
సోష‌ల్ మీడియా యుగంలో ప‌బ్లిసిటీ చాలా సులువు అయిపోయింది. జ‌నం మ‌ర్చిపోయినా తిరిగి త‌మ‌ని తాము రీఇంట్ర‌డ్యూస్ చేసుకునేందుకు ఆస్కారం ఉందిక్క‌డ‌. ఆ కోవ‌లోనే ఇదిగో ఇక్క‌డ `పోకిరి` ఫేం జ్యోతి రానా (శివ్ రానా) ట్విట్ట‌ర్ స‌హా సోష‌ల్ మీడియాల్లో వీరంగ‌మాడేస్తోంది. రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్లు.. వీడియో షూట్ల‌ను అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ ని యంగేజ్ చేస్తోంది.

పోకిరిలో గ్యాంగ్ స్ట‌ర్ గుంపులో డేరింగ్ మాఫియా క్వీన్ లా అద‌ర‌గొట్టిన జ్యోతిరానాకు తెలుగులోనూ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. పూరి డిస్క‌వ‌రీగా త‌న‌ని అంద‌రూ గుర్తుంచుకున్నారు. ఇక న‌ట‌న‌లో జ్యోతిరానా రెబ‌లిజానికి యూత్ లో గొప్ప ఇమేజ్ ఏర్ప‌డింది. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు పూరి తెర‌కెక్కించిన‌ దేవుడు చేసిన మ‌నుషులు చిత్రంలోనూ న‌టించింది. అటుపై తెలుగులో ఆఫ‌ర్లు లేక‌పోయినా బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా న‌టించే అవ‌కాశాలొచ్చాయి. ఇదివ‌ర‌కూ గంధీబాత్ 3 వెబ్ సిరీస్ లో వేడెక్కించే హొయలొలికించి యూత్ కి కంటిపై కునుకు క‌రువ‌య్యేలా చేసింది.

ప్ర‌స్తుతం స‌రైన ఆఫర్లు లేక విల‌విల‌లాడుతోంది. త‌న‌ని ఎవ‌రైనా గుర్తుంచుకుని తిరిగి ఆఫ‌ర్లు ఇస్తారేమోన‌ని త‌న‌వంతు ప్ర‌య‌త్నంగా సోష‌ల్ మీడియాల్ని హీటెక్కిస్తోంది. త‌న ట్యాలెంటును గుర్తించి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన పూరీనే తిరిగి మ‌రో ఆఫర్ ఇస్తారేమో చూడాలి. మొన్న ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ మిస్స‌య్యింది. క‌నీసం రొమాంటిక్ లో అయినా ఛాన్సివ్వ‌లేదు ఎందుక‌నో. క‌నీసం రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్ లో అయినా ఛాన్సుంటుందేమో చూడాలి. కుద‌ర‌క‌పోతే.. ఇంకేదైనా ఆఫ‌ర్ కి ఈ అమ్మ‌డు రెడీ రెడీ!