జక్కన్నకి నో చెప్పి కెరీర్ లోనే పెద్ద తప్పు చేసిందట

Fri Jul 01 2022 13:03:52 GMT+0530 (India Standard Time)

She made a big mistake in her career by saying no to Jakkanna

తపన అనే సినిమా తో దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అర్చన.. అలియాస్ వేద. కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడి పేరు విషయంలో కాస్త గందరగోళం ఉండేది. కాని ఇప్పుడు ఈమె పూర్తిగా అర్చనగా అందరికి సుపరిచితురాలు అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో సందడి చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.నటిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈమెకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. చేసిన పాత్రలకు గుర్తింపు అయితే దక్కింది కాని.. ఎప్పుడు కూడా ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి ఆమె స్వయంకృతం కూడా ఒక కారణం అన్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్ ఉంది. ఆమె కూడా తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో ఆ విషయం నిజమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా లో ఒక ప్రత్యేక సాంగ్ లో అర్చన కనిపించింది. ఆ సాంగ్ ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా చేస్తున్న సమయంలో స్పెషల్ సాంగ్ చేసి తప్పు చేశాను అనుకుందట. ఆ సమయంలోనే మగధీర సినిమాలో ఈమెకు అవకాశం వచ్చింది.  అందులో కూడా ఒక ప్రత్యేక సాంగ్ అవ్వడం వల్ల నో చెప్పిందట.

మగధీర సినిమాలో ఏ పాత్రకు అనే విషయాన్ని అర్చన చెప్పలేదు కాని.. సలోని పోసించిన పాత్రకు మొదట అర్చనను అడిగి ఉంటారు అనేది టాక్. ఆ విషయం పక్కన పెడితే మగధీర సినిమాలో నటించక పోవడం వల్ల రాజమౌళి నుండి ఒక మంచి ఆఫర్ మిస్ అయ్యిందని అర్చన ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక వేళ మగధీర చేసి ఉంటే ఖచ్చితంగా తదుపరి సినిమా అంటే మర్యాద రామన్న లో అర్చనకు అవకాశం ఉండేది. తద్వారా ఇండస్ట్రీలో స్టార్ గా గుర్తింపు దక్కి ఉండేది అంటూ ఆమె అభిప్రాయం. నిజంగానే అర్చన మగధీర సినిమా ను కాదని పెద్ద తప్పు చేసింది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి.

మగధీర సినిమాకు నో చెప్పడం తన కెరీర్ లోనే అతి పెద్ద తప్పు అన్నట్లుగా అర్చన కూడా తాజాగా అలీ తో సరదాగా టాక్ షో లో పాల్గొంది. భర్త తో కలిసి టాక్ షో లో పాల్గొన్న అర్చన పలు విషయాలను షో లో చెప్పుకొచ్చంది. వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న షో కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో వైరల్ అవుతోంది.