టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ఈమె!!

Thu Jun 10 2021 16:00:01 GMT+0530 (IST)

She is a Tollywood Lady Superstar !!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా సాయి పల్లవి పేరు మారు మ్రోగిపోతుంది. కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా నటిగా కూడా సాయి పల్లవి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఫిదా తో టాలీవుడ్ కెరీర్ ను ఆరంభించిన సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. కాస్త నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఏమి ఉన్నా కూడా ఎక్కువ శాతం సాయి పల్లవి వైపే మేకర్స్ చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సాయి పల్లవికి వస్తున్న ఆఫర్లు చాలా చాలా ఉన్నాయి. కాని ఆమె ఆచితూచి మరీ సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.కమర్షియల్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న సాయి పల్లవి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. అందులో ముఖ్యంగా లవ్ స్టోరీ మరియు విరాట పర్వం సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. ఈ మూడు సినిమాలు కూడా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలతో సాయి పల్లవి కనిపించబోతుంది.

ఈమూడు సినిమాల తర్వాత ఖచ్చితంగా టాలీవుడ్ లో సాయి పల్లవి లేడీ సూపర్ స్టార్ గా నిలవడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే విరాటపర్వంలోని సాయి పల్లవి నటన మరో లెవల్ లో ఉంటుందని టీజర్ చూసిన వారు అనుకుంటున్నారు. ఇక లవ్ స్టోరీ తో మరోసారి ఫిదా చేయడం ఖాయం అంటున్నారు. ఇక శ్యామ్ సింగ రాయ్ లో ఈమె లుక్ చూస్తుంటే ఏదో ప్రయోగం అన్నట్లుగా ఉంది. కనుక ఈ సినిమాలు ఖచ్చితంగా సాయి పల్లవి రేంజ్ ను మరింతగా పెంచడంతో పాటు ఆమెను మరింత గా వాటెండ్ హీరోయిన్ గా మార్చే అవకాశాలు ఉన్నాయి.