క్రేజీ హీరో స్టన్నింగ్ మేకోవర్ అదిరింది

Wed Jun 29 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Sharwanandh New Makeover

కరోనా తరువాత సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. అన్ని రంగాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. సినీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంత పెద్ద స్టార్ నటించినా నచ్చిన విధంగా లేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో స్టార్ హీరోలు సైతం ఆడియన్స్ ని మెప్పించడానికి ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రత్యేకంగా మేకోవర్ విషయంలో ఈ మధ్య మన హీరోలు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.తాజాగా యంగ్ అండ్ వెర్సటైల్ స్టార్ శర్వానంద్ తన మేకోవర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని సినిమాల్లో బొద్దుగా మారిన శర్వానంద్ ప్రస్తుతం షాకింగ్ మేకోవర్ లోకి వచ్చేసి షాకిస్తున్నాడు. ఆ మధ్య జరిగిన నాగశౌర్య మూవీ 'లక్ష్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లుక్ పై కొన్ని కామెంట్ లు చేశారు. మేకోవర్ మార్చుకుని మంచి షేప్ లోకి వచ్చిన తరువాతే కొత్త చిత్రానికి సైన్ చేస్తానని వేదికగా సాక్షిగా మాటిచ్చారు.

తను నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం శర్వానంద్ నటించిన బైలింగ్వల్ మూవీ 'ఓకే ఒక జీవితం' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ తరువాతే తాను సరికొత్త మేకోవర్ లోకి వచ్చాక మాత్రమే కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని హీరో శర్వానంద్ ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే షాకింగ్ మేకోవర్ లో ట్రాన్స్ ఫార్మ అయిపోయారు. తాజాగా బయటికి వచ్చిన శర్వా ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

బ్లూ కలర్ హ్యాండ్లూమ్ కుర్తా షర్ట్.. పైన శాలువా.. బ్లాక్ కలర్ గాగుల్స్.. స్టైలిష్ గడ్డంతో స్టన్నింగ్ మేకోవర్ లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిన శర్వా బరువు తగ్గి పూర్తి ఫిట్ గా కనిపిస్తున్నాడు. అతని లుక్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తూ నెటిజన్స్ ని షాక్ కు గురిచేస్తోంది. ఇంతలో ఇంత మార్పా అంటూ చాలా మంది కామెంట్ లు చేస్తున్నారు. ఈ మేకోవర్ కోసం శర్వా కఠినమైన డైట్ ని ఫాలో అయ్యాడట. గంటల పాటు జిబ్ లో చమటోడ్చాడట.

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా ఈ సారి గట్టిగానే కొట్టాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందు కోసమే తన కొత్త సినిమా కోసం స్టన్నింగ్ మేకోవర్ లోకి మారినట్టుగా తెలుస్తోంది. శర్వానంద్ త్వరలో యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్యతో ఓ సరికొత్త సినిమాని చేయబోతున్నారు. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కినుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాల్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా వుంటే శర్వా సోషల్ మీడియా ఇన్ స్టాలో 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకోవడం విశేషం.