Begin typing your search above and press return to search.
హీరో శర్వానంద్ కు కాబోయే భార్య ఎవరు..తన బ్యాగ్రౌండ్ ఏంటీ?
By: Tupaki Desk | 26 Jan 2023 1:37 PMటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రేజీ హీరోలు కోవిడ్ సెకండ్, థర్డ్ వేవ్ లోనే పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. నిఖిల్, రానా, నితిన్.. ఇలా చాలా మంది యంగ్ హీరోల పెళ్లిళ్లు కోవిడ్ టైమ్ లోనే జరిగిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే వున్నా అందులో శర్వానంద్ పెళ్లికి రెడీ అయిపోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
ఫైనల్ గా ఆ వార్తలని నిజం చేస్తూ..బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తూ రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, ఇరువురి కుటుంబ సభ్యులు సన్నిహిత బంధువుల మధ్య ఘనంగా జరిగింది.
ఈ నిశ్చితార్థానికి శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్, వెల్ విషర్ రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా హాజరై శర్వా, రక్షితా రెడ్డిలకు శుభాకాంక్షలు అందజేశారు. ఇదిలా వుంటే శర్వా వివాహం చేసుకుంటున్న రక్షితా రెడ్డి ఎవరు? .. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటీ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రక్షితా రెడ్డి గత కొంత కాలంగా యుఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారని తెలిసింది. అంతే కాకుండా వీరిది పెద్దలు కుదిర్చిన సంబందం అని సమాచారం. ఇక రక్షితా రెడ్డి కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలే బయటకు వచ్చాయి. రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలిసింది. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలుగా చెబుతున్నారు.
శర్వానంద్, రక్షితా రెడ్డిల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు తాజాగా సోసల్ మీడియాలో విడుదల చేశారు. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్ లో పాల్గొన్నారట. వారి సమక్షంలో ఈ జంట ఎంగేజ్ మెంట్ రింగ్ లని మార్చుకున్నారట. ప్రస్తుతం నెట్టింట వీరి ఫొటోలు వైరల్ అవుతుండగంతో సెలబ్రిటీలతో పాటు నెటిజన్ లు , శర్వా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
త్వరలోనే శర్వా, రక్షితా రెడ్డిల వెడ్డంగ్ తేదీని ఇరు కుటుంబాల వారు ప్రకటించనున్నారు. సమ్మర్ లో వీరి వివాహం జరగనుందని తెలిసింది. 'ఒకే ఒక జీవితం' మూవీతో ఇటీవల సక్సెస్ ని సొంతం చేసుకున్న శర్వా నంద్ ఆ సక్సెస్ జోష్ లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.