శర్వానంద్ అప్పుడే వచ్చేశాడు!

Wed Jul 17 2019 16:50:26 GMT+0530 (IST)

ఇటీవలే విదేశాల్లో స్కై డైవింగ్ చేస్తూ గాయపడి కుడి భుజానికి గాయం చేసుకున్న శర్వానంద్ ఎట్టకేలకు కోలుకున్నాడు. డాక్టర్లు చెప్పిన రెస్ట్ టైం ఇంకా పూర్తి కానప్పటికీ చేయాల్సిన సన్నివేశాలు రిస్క్ లేని టాకీ పార్ట్ కావడంతో హైదరాబాద్ లో జరుగుతున్న 96 రీమేక్  షెడ్యూల్ కోసం వచ్చేశాడు. శర్వా కోసమే వెయిటింగ్ లో ఉన్న యూనిట్ ఇప్పుడు పనిని వేగవంతం చేసింది. తమిళ్ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో సమంతా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇరవై ఏళ్ళ క్రితం స్కూల్ లో  కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ని వర్తమానంలో అదే చోట కలుసుకున్న హీరో ద్వారా అతని ప్రేమ కథను ప్రేక్షకులను రంజింపజేసేలా తీసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులోనూ బాధ్యతలు తీసుకున్నాడు. విదేశాల్లోనూ కొంత షూటింగ్ ఉంటుందని శర్వా పూర్తిగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాక అది ప్లాన్ చేస్తారని తెలిసింది. విభిన్న చిత్రాలతో వరస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటున్న సమంతా దీని మీద కూడా చాలా నమ్మకంగా ఉంది.

మరోవైపు ఆగస్ట్ 15కు కొత్త డేట్ సెట్ చేసుకున్న రణరంగం ప్రమోషన్స్ కోసం కూడా శర్వా రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్- కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సామాన్యుడు పవర్ ఫుల్ డాన్ లా ఎదిగిన క్రమాన్ని రణరంగంలో చూపించినట్టుగా టాక్. దానికి పూర్తి వ్యతిరేకమైన దిశలో సాగే ఇప్పుడీ 96 చేయడం విశేషం. తెలుగు రీమేక్ వెర్షన్ కు ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు. జానూ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు వినికిడి