శర్వా27 ప్రీ లుక్ పోస్టర్ అదిరిందిగా

Fri May 24 2019 21:13:31 GMT+0530 (IST)

Sharwanand 27th Movie Pre Look Poster

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  త్వరలో రిలీజ్ కు సిద్దం అవుతున్న ఈ సినిమాకు నెమ్మదిగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి.శర్వానంద్ కెరీర్లో 27 వ చిత్రం అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు (మే 25) సాయంత్రం 04:05 గంటలకు రిలీజ్ చేస్తామని ఫిలిం మేకర్స్ ప్రకటించారు.  ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ కు శాంపిల్ అన్నట్టుగా ఒక ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.  బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ లో సిలౌట్ డిజైన్ లో శర్వా నిలబడి ఉన్నాడు.  వెనక ఓ అరడజను మంది ఫాలోయర్లు కూడా నిలబడి ఉన్నారు.  జోరుగా కురుస్తున్న వానలో ఇలా శర్వా తన గ్యాంగ్ తో నిలబడి ఉండడంలో పోస్ట్ చాలా ఇంటెన్స్ గా ఉంది. మరో యాంగిల్ ఈ పోస్టర్ ఒక పెయింటింగ్ లా కూడా అనిపిస్తోంది.

ఈ సినిమాలో శర్వా ఒక యువకుడిగా.. మధ్యవస్కుడైన డాన్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఫిలిం మేకర్స్ రిలీజ్ చేసిన ఆన్ లొకేషన్ స్టిల్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక రేపు రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ పోస్టర్లోనే టైటిల్ కూడా వెల్లడిస్తారా లేదా అనేది వేచి చూడాలి.  ఏదేమైనా ప్రీ లుక్ మాత్రం అదరహో!