అరే ఎంట్రా ఇది.. ఈ ముద్దుల గోల అవసరమారా నీకు?

Mon Mar 20 2023 09:59:29 GMT+0530 (India Standard Time)

Shanmukh Jaswanth Shared A Video Song

యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిపోయి.. సెలబ్రిటీ స్టేటస్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్ లో అతగాడికున్న ఫాలోయింగ్ కాస్తంత ఎక్కువే. చూసేందుకు నార్మల్ గా.. పక్కింటి కుర్రాడిలా కనిపించటం కూడా షణ్నుకు ప్లస్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది.బిగ్ బాస్ లో టైటిల్ ఫేవరెట్ గా దిగినా.. రన్నరప్ గా మిగలటం ఒక ఎత్తు.. ఈ షోలో.. తన తోటి కంటెస్టెంట్ సిరితో పండించిన హౌస్ రొమాన్సు శ్రుతిమించి రాగాన పడటం.. బిగ్ బాస్ హౌస్ లో ఇదేంట్రా అన్న రీతిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ తీరు పుణ్యమా అని రియల్ లైఫ్ లో పీకల్లోతు ప్రేమలో ఉన్న దీప్తి సునయనతో బ్రేకప్ అయ్యిందన్న మాట బలంగా వినిపించింది. అయితే.. కెరీర్ మీద ఫోకస్ పెట్టనున్నట్లుగా పేర్కొంటూ ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకోవటం తెలిసిందే.

ఆ తర్వాత వీరిద్దరు జంటగా కనిపించింది లేదు. ఎవరికి వారుగా యూట్యూబ్ సాంగ్స్ అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా షణ్ను పోస్టు చేసిన వీడియో సాంగ్ ఇప్పుడు రొమాంటిక్ సెగలు రేపుతోంది.

ఈ పాట సందర్భంగా తాను కొత్తగా జత కట్టిన ఫణి పూజిత అనే అమ్మాయితో కెమిస్ట్రీని భారీగా పండించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయ్యయ్యో అంటూ విడుదల చేసిన ఈ సాంగ్ లో ముద్దులతో ముంచెత్తటం ఒక ఎత్తు అయితే.. మరీ ఇంత రొమాన్సు ఏంట్రా బాబు అనే పరిస్థితి.

ఈ వీడియోను చూసిన వారిలో పలువురు..ఈ వీడియోను చూస్తే దీప్తి ఫీల్ కాదా బ్రో అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు షణ్ను ఊతపదమైన 'అరే.. ఎంట్రా' అన్న మాటను ప్రస్తావిస్తూ.. అరే ఎంట్రా.. మరీ ఇంతలానా? అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఏమైనా.. ముద్దులతో మరోసారి షణ్ను చర్చలోకి వచ్చారని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.