Begin typing your search above and press return to search.
ఇండియన్ 2.. ముందుగానే ప్లాన్ చేస్తున్న శంకర్
By: Tupaki Desk | 1 April 2023 12:00 PMసౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలని డీల్ చేస్తున్నాడు. ఓ వైపు కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా ఇండియన్2ని కమల్ హసన్ తో తెరకెక్కిస్తున్నారు. దీనిపై భారీ హైప్ ఉంది. శంకర్, కమల్ హసన్ కాంబినేషన్ లో రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి దానిపైన ఉంది.
మరో వైపు తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. తాజాగా ఈ మూవీకి సంబందించిన సాంగ్ షూట్ ని హైదరాబాద్ లో చేస్తున్నారు.
దీని తర్వాత మరల ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని శంకర్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ మూవీకి లాంగ్ గ్యాప్ ఇచ్చి ఇండియన్ 2 సినిమా షూటింగ్ జూన్ నాటికి పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని శంకర్ దృవీకరించారు.
జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేసి దీపావళికి నవంబర్ 9న ఇండియన్ 2 రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కంటే ముందుగానే శంకర్ ఇండియన్ 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని దీనిని బట్టి తెలుస్తుంది.
ఇక వేళ ఇండియన్ 2 నవంబర్ లో రిలీజ్ అయితే మాత్రం గేమ్ చేంజర్ మూవీ వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
సంక్రాంతికి దిల్ రాజు అనుకుంటున్న అది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్, ప్రభాస్ మధ్య స్ట్రాంగ్ ఫైట్ ఉంటుంది. ఈ నేపధ్యంలో గేమ్ చేంజర్ ని అప్పుడే తీసుకొచ్చి దిల్ రాజు రిస్క్ చేయకపోవచ్చని టాక్.