Begin typing your search above and press return to search.

ఘాజీ సంక‌ల్ప్ బాలీవుడ్ ప్ర‌యోగం ఎప్పుడు?

By:  Tupaki Desk   |   26 Feb 2020 8:18 AM GMT
ఘాజీ సంక‌ల్ప్ బాలీవుడ్ ప్ర‌యోగం ఎప్పుడు?
X
టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ సంకల్ప్ రెడ్డి ప్ర‌యోగాల గురించి తెలిసిందే. ఘాజీ- అంతరిక్షం ఇలా వ‌రుస‌గా భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో సంక‌ల్ప్ ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్ అయ్యాడు. జ‌యాప‌జ‌యాల మాట ఎలా ఉన్నా అత‌డి ప్రయోగాత్మ‌క ఆలోచ‌న అంద‌రికీ న‌చ్చింది. పాత్ బ్రేకింగ్ సినిమాలతో సాహ‌సం మైమ‌రిపించింది.

ప్ర‌స్తుతం అత‌డు నెట్ ఫ్లిక్స్ `లస్ట్ స్టోరీస్` తెలుగు వెర్షన్ లో ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సిరీస్ ఓటీటీ వేదిక‌పై ఏ మేర‌కు మెప్పిస్తుంది అన్న‌ది వేచి చూడాలి. వెబ్ సిరీస్ త‌ర్వాత సంక‌ల్ప్ ప్లాన్ ఎలా ఉంది? అంటే.. `కమాండో` ఫేం.. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కోసం సంకల్ప్ స్క్రిప్ట్ రాస్తున్నాడ‌ని తెలుస్తోంది.

భారతీయ ఆర్మీ ఆఫీసర్ అయిన విద్యుత్ తండ్రి సంకల్ప్ ని స్వ‌యంగా కోరార‌ట‌. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక యాక్షన్ డ్రామాను రాయమని కోరార‌ని తెలుస్తోంది. సంకల్ప్ ప్రస్తుతం స్క్రిప్ట్ ప‌నిలో బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి. విద్యుత్ అంటేనే హైఓల్టేజ్ యాక్ష‌న్ ఇమేజ్ ఉన్న హీరో. అత‌డితో సినిమా అంటే సంక‌ల్ప్ కెరీర్ లో మ‌రో ఛాలెంజింగ్ ఎటెంప్ట్ అనే చెప్పాలి. ఈ కాంబినేష‌న్ మూవీ ఎప్ప‌టికి సెట్స్ కి వెళుతుంది? అన్న‌ది చూడాలి.