Begin typing your search above and press return to search.

ఆస్కార్ వేదికపై నిర్మాతకు అవమానం..!

By:  Tupaki Desk   |   18 March 2023 11:30 AM GMT
ఆస్కార్ వేదికపై నిర్మాతకు అవమానం..!
X
95వ ఆస్కార్ అవార్డుల్లో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ తో పాటుగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. అఫీషియల్ నామినేషన్స్ లో ఆస్కార్ కి వెళ్లిన ఈ షార్ట్ ఫిల్మ్ అకాడమీ అవార్డును అందుకుంది. ఆ షార్ట్ ఫిల్మ్ నిర్మాత గునీత్ మోంగా అంతకుముందు కూడా ఎన్నో గొప్ప సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశారు. ఫైనల్ గా ది ఎలిఫెంట్ విష్పరర్స్ కి ఆస్కార్ దక్కింది. అయితే ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉన్నా అవార్డు వేదిక మీద తనకు అవమానం జరిగిందని అంటున్నారు గునీత్ మోంగా.

ఆస్కార్ నిర్వాహకుల మీద ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరు 45 సెకన్ల పాటు మాట్లాడే అవకాశం ఇస్తారు. అంతకుమించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వారి మైక్ కట్ చేస్తారు. ఆ తర్వాత మ్యూజిక్ ప్లే చేస్తారు. అయితే ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత గునీత్ మోంగా తన స్పీచ్ మొదలు పెట్టిన వెంటనే మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేశారట. అవార్డు అందుకున్న టైం లో తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పకుండా చేశారని ఆమె ఇండియాకు వచ్చిన తర్వాత మీడియాకు చెప్పారు.

కావాలని చేశారా లేక పొరపాటున జరిగిందా అన్నది తెలియదు కానీ గునీత్ మోంగా ఆస్కార్ నిర్వాహకులు చేసిన ఈ పనికి చాలా హర్ట్ అయ్యారట. అయితే తను మాట్లాడేప్పుడు మైక్ కట్ చేసి ఆ తర్వాత యానిమేటెడ్ షార్ట్ అవార్డు అందుకున్న వారికి మాత్రం 45 సెకన్ల పాటు మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆమె చెప్పారు. తనకు మాత్రం అలా ఎందుకు చేశారో అర్ధం కావట్లేదని గునీత్ మోంగా అన్నారు.

అయితే ఇదే ఆస్కార్ వేదిక మీద ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ లైవ్ డాన్స్ చేశారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాట పాడగా అమెరికన్ డాన్సర్ స్టేజ్ మీద డాన్స్ వేశారు. మరి గునీత్ మోంగా విషయంలో అలా ఎందుకు జరిగింది అన్నది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.