Begin typing your search above and press return to search.

అద్దంలో కన్పిస్తున్న పిల్ల భలే.. దాని ఫిగర్ భలే!

By:  Tupaki Desk   |   2 Jun 2020 9:30 AM GMT
అద్దంలో కన్పిస్తున్న పిల్ల భలే.. దాని ఫిగర్ భలే!
X
షామా సికందర్.. ఈ పేరు గ్లామర్ ప్రియులకు బాగా పరిచయం. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. షామా సికిందర్ 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది. బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. పలు శృంగారభరిత వెబ్‌ సిరీస్‌లల్లో యాక్ట్ చేసింది షామా. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు. కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది. ఈ 38 ఏళ్ల బ్యూటీ.. తక్కువ సినిమాలను చేసిన.. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసింది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి. రీసెంట్ గా ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో సెగలు పుట్టించింది షామా.

ఇంకా పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించిన అనుభవం ఈ బ్యూటీ సికందర్ కు ఉంది. షామాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ మాములుగా ఉండదు. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో బ్లాక్ డ్రెస్ వేసుకొని అద్దం ముందు నిలబడి తన పరువాలను అలా ఓరగా చూస్తూ కొత్త లుక్ ఇచ్చింది. అంతే ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఎవరైనా ఊరుకుంటారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన అందగత్తెలు కాసింత అరుదుగానే ఉంటారు. వారిలో ఈ షామా సికందర్ ను కూడా చేర్చేయచ్చు అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక ఈ బ్యూటీ 2019గానూ 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్' అవార్డులను సొంత చేసుకుంది. ఆ రేంజ్ లో పాపులర్ అవుతున్నాయి మరి షామా అందాల సిరులు. ఫ్యాన్స్ మాత్రం ఆ అద్దంలో అమ్మడిని చూసి హీటెక్కిపోతున్నారు.