Begin typing your search above and press return to search.

బాతు టబ్బులో అమ్మడి పాలపొంగుల పరువాల ధార..!!

By:  Tupaki Desk   |   7 July 2020 1:30 AM GMT
బాతు టబ్బులో అమ్మడి పాలపొంగుల పరువాల ధార..!!
X
షామా సికందర్.. గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపించే షామా సికందర్.. అందాల ఆరబోతలో దిట్ట. 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత తక్కువ సినిమాలే చేసింది. కానీ బుల్లితెర పై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. పలు శృంగారభరిత వెబ్‌ సిరీస్‌లల్లో కూడా నటించి మెప్పించింది షామా. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు. కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది. ఈ 38 ఏళ్ల బ్యూటీ.. తక్కువ సినిమాలను చేసిన.. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసింది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి. రీసెంట్ గా ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో సెగలు పుట్టించింది ఈ భామ.

మ్యూజిక్ వీడియోలలో కనిపించిన అనుభవం ఈ సికందర్ బ్యూటీకి ఉంది. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు తన పాలపొంగుల పరువాల ధారను బాత్ టబ్ లో కురిపించింది. కలువ పూల మధ్య విచ్చిన గులాబీ పువ్వులా అమ్మడి పోజిచ్చింది. ఓరచూపులతో ఈ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఏ అభిమాని అయినా ఊరుకుంటారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన అందగత్తెలు కాసింత అరుదుగానే ఉంటారు. వారిలో ఈ షామా సికందర్ టాప్ లోనే ఉంటుంది. ఇక ఈ బ్యూటీ 2019గానూ 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్' అవార్డులను సొంత చేసుకుంది. ఆ రేంజ్ లో పాపులర్ అవుతుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఫ్యాన్స్ మాత్రం బాత్ టబ్ లో బ్యూటీ కసి చూపులకు హీటెక్కిపోతున్నారు.