షాలిని ప్యాకింగులు చూస్తే స్టన్నవుతారు సుమీ!

Wed Jul 21 2021 05:00:01 GMT+0530 (IST)

Shalini Pandey Latest Photo

నటించిన తొలి సినిమాతోనే నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది షాలినిపాండే. `అర్జున్ రెడ్డి` లో ప్రేమికురాలిగా అద్భుత నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. రా అండ్ రస్టిక్ మెడికో దేవరకొండతో పోటీపడుతూ పెర్పామెన్స్ పరంగా సత్తా చాటింది. ఆ తర్వాత మహానటి చిత్రంలోనూ చక్కని నటనతో మెప్పించింది. ఇటీవల బాలీవుడ్ లో క్రేజీ సినిమాలకు సంతకాలు చేస్తోంది. పనిలో పనిగా.. ఆఫ్ ది స్క్రీన్ ఫోటో షూట్లతో చెలరేగుతూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల అటెన్షన్ డ్రా చేస్తోంది.తాజాగా షాలిని సిక్స్ ప్యాక్ లుక్ తో షాకిచ్చింది. షాలిని న్యూ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మునుపటితో పోలిస్తే షాలిని లుక్ అమాంతం మారిపోయింది. శరీరాకృతిలో ఊహించని మార్పులు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్నర్ లో తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీని ఎంతగా రాటు దేలాలే తయారు చేసిందో స్ఫష్టంగా కనిపిస్తోంది.  జీరో సైజ్ లుక్ తో చూపరులను ఆకట్టుకుంటోంది.  

ప్రస్తుతం కెరీర్ పరంగా విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటున్న షాలిని.. నటించిన తొలి సినిమాలోనే రొమాంటిక్ ప్రియురాలిగా నటించి ఫిదా చేసింది. ఆ కిక్ లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆ లుక్ బాలీవుడ్ కి సరిపోదు. ఇటీవల ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం అక్కడ రెండు సినిమాలు చేస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న `జయేష్ భాయ్ జోర్డార్ ` చిత్రంతో పాటు `మహారాజ` చిత్రాల్లో నటిస్తోంది. ఎంచుకున్న స్క్రిప్టును బట్టి పరిశ్రమను బట్టి తన బాడీ లాంగ్వేజ్ ని లుక్ ని పూర్తి గా మార్చేసిందని అర్థమవుతోంది.