'శాకినీ- ఢాకినీ'...రెజీనా

Mon May 03 2021 10:00:01 GMT+0530 (IST)

'Shakini- Dhakini' ... Regina

తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కవ టైమ్ లోనే అందం అభినయం ఉన్న హీరోయిన్లలో రెజీనా ఒకరుగా పేరు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి మంచి కెరీర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఊహించని విధంగా రేస్ లో వెనకబడింది. విశాల్ తో చేసిన చక్రతో మళ్లీ ఫామ్ లోకి వస్తుందనుకుంటే ఆ సినిమా ఆడలేదు. రెజీనా కాసాండ్రా..'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది. కానీ అక్కడా నిలదొక్కుకోలేకపోయింది.నిజానికి రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అడవి శేష్ నంటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత ఈమె పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే తాజాగా ఆమె ఓ సినిమా కమిటైందని సమాచారం. ఆ సినిమా టైటిల్  'శాకినీ- ఢాకినీ'.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతన్న యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం. కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రెజీనా ..ఓ ట్రైనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. నివేదితా థామస్ మరో కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇదో ఫిమేల్ ఓరియెంటెడ్ డ్రామా.

సమంతతో చేసిన ఓహ్ బేబీ హిట్ ఇచ్చిన ఉత్సాహంలో సురేష్ బాబు ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సునీతా థాటిసురేష్ ప్రొడక్షన్స్ కలిపి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమా విజయాన్ని సాధిస్తే అక్కడ ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలుఉన్నాయి. చూడాలిమారి ఈసినిమా ఏ స్దాయి విజయంసాధిస్తుందో.