షారుక్ టార్గెట్ ఇక అదే.. త్వరలోనే బిగ్ మూవీస్

Wed Feb 08 2023 07:00:01 GMT+0530 (India Standard Time)

Shahrukh's target is the same. Big movies soon

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత థియేటర్లలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ బాద్ షా షారుక్ పఠాన్తో దుమ్మురేపుతున్నారు. జనవరి 25న  విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.  అసలే గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్  పరిశ్రమ వెలవెల బోతుండగా షారుక్ తిరిగి గాడిలోకి తీసుకొచ్చారు. ఆయన నటించిన ఈ మూవీ నార్త్ సౌత్ ఓవర్సీస్ అని తేడా లేకుండా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాను ఈ స్థాయిలో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు.



మొత్తంగా ఈ చిత్రం షారుక్ ఖాన్ కమ్ బ్యాక్ అదిరిపోయింది. అభిమానులు కూడా కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1000 కోట్ల కలెక్షన్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. దీంతో షారుక్ చాలా కాలంగా ఎదురుచూసిన సెన్షేషనల్ హిట్ తీరిపోయింది. ఈ సెక్సెస్ బాలీవుడ్కు కూడా గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. మళ్లీ ఓ హిందీ సినిమా చూసేందుకు ఈ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో తమ కష్టాలు తొలగిపోయినట్లే అని బాలీవుడ్ భావిస్తోంది.

ఇక షారుక్ తర్వాతి సినిమాల లైనప్ చూస్తుంటే మరో రెండేళ్లలో అతడు ఎవ్వరూ ఊహించలేని స్థాయికి వెళ్లిపోతాడని  అర్థమవుతోంది. అదిరిపోయే కంటెంట్లతో ఆయన రానున్నారు.  ఈ ఏడాదిలో మరో  ఆరు నెలల్లో జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  తమిళ దర్శకుడు అట్లీ దీన్ని రూపొందిస్తున్నారు.  ఆయన కమర్షియల్ సినిమాలను..  స్టార్ హీరోలతో చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్తోపాటు మాస్ ప్రేక్షకులు కూడా బాగా చూస్తారు. ఈ చిత్రంలో పఠాన్ను మించిన ఎలివేషన్లు యాక్షన్స్  ఉంటాయని భావిస్తున్నారు.

దీని తర్వాత షారుక్..  రాజ్ కుమార్ హిరానితో డంకీ సినిమా చేస్తున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుంచి సంజు వరకు హిరాని అన్నీ బ్లాక్బస్టర్లే తీశారు. టాప్ స్టార్తో సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలే. అలా పఠాన్ జవాన్ పక్కా మాస్ సినిమాలు కాగా.. డంకి కంటెంట్ ఉన్న సినిమాగా ప్రేక్షకుల్ని ఆక్టటుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు కూడా హిట్ అయితే బాక్సాఫీస్ షేకే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.