అట్లీ.. సూపర్ స్టార్ మూవీ క్రేజ్ ఇదే సాక్ష్యం

Sun Jun 26 2022 17:00:01 GMT+0530 (IST)

Shahrukh Khan Jawaan Movie

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జవాన్. ఈ సినిమా కంటే ముందుగా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే.. జవాన్ సినిమాకు సంబంధించిన హడావుడి బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది.షారుఖ్ మరియు అట్లీ ల కాంబోలో మూవీ గురించి గత మూడు నాలుగు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కి విడుదలకు కూడా రెడీ అవుతోంది. షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చిన జవాన్ విడుదల తేదీ విషయం లో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇంకా జవాన్ మూవీ విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వకుండానే అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి షారుఖ్.. అట్లీ ల జవాన్ సినిమా ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. థియేట్రికల్ స్క్రీనింగ్ అయిన తర్వాత సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారట.

ఓటీటీ లో జవాన్ సినిమా స్ట్రీమింగ్ అప్‌డేట్ అప్పుడే రావడం ను బట్టే సినిమా కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా కు కేవలం హిందీ ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళం మరియు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మరియు అంచనాలు భారీగా ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

జవాన్ సినిమాలో షారుఖ్ కు జోడీగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ సినిమా లో ప్రియమణి మరియు సన్యా మల్హోత్రా నటిస్తున్నారు. సినిమా పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ను అత్యధిక థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది. సినిమా కు ఉన్న క్రేజ్ కారణంగానే ఇన్నాళ్ల ముందే నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.