Begin typing your search above and press return to search.

సినిమాని ఆదరించాలంటే కంటెంట్ ఉండాలి కదా..!

By:  Tupaki Desk   |   9 Jun 2023 4:00 PM GMT
సినిమాని ఆదరించాలంటే కంటెంట్ ఉండాలి కదా..!
X
సినిమా కంటెంట్ బాగుండాలి కానీ, ఆదరించడంలో దక్షిణాది ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సినిమా నచ్చితే చూస్తారు. నచ్చకుంటే విమర్శిస్తారు. అది మన హీరో అయినా, పక్క ఇండస్ట్రీ హీరో అయినా సరే. మన భాష కాదు అని ఏనాడూ పక్కన పెట్టం. ఇలాంటివి ఎక్కువగా ఉత్తరాది ప్రేక్షకులే చేస్తారు. దక్షిణాది సినిమాలను వారు చాలా సందర్భాల్లో తక్కువ చేశారు. అలాంటిది బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా అలరిస్తున్నారు. ఇటీవల ప్రసారమైన 'ఫార్జీ' వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బ్లడ్ డాడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తమ బాలీవుడ్ ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదర్శిస్తున్నారని ఆయన అన్నారు. హిందీ ప్రేక్షకులు మీ చిత్రాలను ఆదరించినట్లే, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా హిందీ సినిమాలను ఆదరించాలని ఆయన కోరడం గమనార్హం.

అప్పుడే భారతీయ సినిమా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా, ప్రేక్షకులు సినిమా విషయంలో చాలా ఓపెన్ గా ఉ:డాలని, అన్ని వర్గాల, అన్ని భాషల సినిమాలను ఆదర్శించాలని అన్నారు.

ఆయన చెప్పిన మాటలు బాగున్నాయి. అందరూ అన్ని వర్గాల సినిమాలను ఆదరించాలి. కానీ, దక్షిణాది ప్రేక్షకులు హిందీ సినిమాలను ఆదరించడం లేదు అనడం మాత్రం కరెక్ట్ కాదు.దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను ఆదరించకపోతే షోలే, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, 3 ఇడియట్స్ వంటి బ్లాక్‌బస్టర్‌లు వచ్చేవా? అంతెందుకు మొన్నటికి మొన్న విడుదలైన పఠాన్ అన్ని కోట్లు రాబట్టగలిగేదా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

అంతెందుకు షాహిద్ కపూర్ కబీర్ సింగ్ సినిమా తెలుగు సినిమాకి రీమేక్ అయినప్పటికీ, దక్షిణాదిన కూడా బాగానే క్లిక్ అయ్యింది. భాషతో సంబంధం లేకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నింటినీ ప్రేక్షకులు ఆదర్శిస్తున్నారు. సరిగా లేని సినిమాలను మాత్రం ఎవరూ చూడటానికి ఇష్టపడటం లేదు. నిజంగా, బాలీవుడ్ సినిమాలో కంటెంట్ ఉంటే, స్పెషల్ గా చూడమని చెప్పాల్సిన అవసరం లేదనే కామెంట్స్ వినపడుతున్నాయి.