'పఠాన్' లో షారుక్.. బాద్ షా ఈజ్ బ్యాక్!

Sat Jun 25 2022 19:51:04 GMT+0530 (IST)

Shah Rukh Khan Pathaan movie Motion Poster

బాద్ షా షారుక్ ఖాన్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. బాక్సాఫీస్ వద్ద విజయం దుందుంబీ మోగించి దాదాపు ఐదేరాళ్లు అవుతుంది. చేస్తోన్న ఏ భారీ ప్రయత్నం ఫలించలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `దిల్ వాలే`..`ఫ్యాన్`..`రయిస్`..`ట్యూబ్ లైట్`..`జబ్ హ్యారీ మెట్ సీజల్`.. `జీరో `ఏవీ షారుక్ రేంజ్ సక్సెస్ సాధించలేదు. అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు..అదే రేంజ్ లోనూ రిలీజ్ అయ్యాయి.కానీ `చెన్నై ఎక్స్ ప్రెస్` రేంజ్ సక్సెస్ని అందుకోలేదు. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఏకంగా  నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని పఠాన్ తో ప్రేక్షకుల  ముందుకు రావడానికి రెడీ అవుతన్నారు. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ పవర్ ఫుల్ కంటెంట్ తోనే తెరకెక్కుతోంది. షారుక్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా పక్కా కమర్శియల్ చిత్రంగా రాబోతుంది.
 
తాజాగా  `పఠాన్` మోషన్  పోస్టర్  కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయింది.  షారుక్ లుక్ మాత్రం అసాధరణమనే చెప్పాలి. ముంబైలో మరో పవర్ ఫుల్  గ్యాంగ్ స్టర్ ని దించినట్లే కనిపిస్తుంది. గన్ నేలకి పెట్టి... గురి పెట్టడానికి ప్రత్యర్ధిని తీక్షణం గా చూస్తోన్న షారుక్ లో రౌద్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  

షారుక్ హెయిర్ స్టైల్..బియర్డ్ లుక్  సూపర్బ్. స్పాట్ లైట్ లో షారుక్ బ్యాక్ ఫోజు అల్టిమేట్ గా డిజైన్ చేసారు. బాద్ షాని ఈ లుక్ లో చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు తప్పవు. ఆ రేంజ్ లో పఠాన్ లుక్ ఫైర్ అందిస్తుంది.

చాలా కాలం తర్వాత షారుక్ ఇలాంటి లుక్ లో కనిపించడంతో ఫ్రెష్ గా కనిపిస్తున్నారు.  పోస్టర్ నే ఈ రేంజ్ లో వదిలారంటే..టీజర్..ట్రైలర్ ఇంకే రేంజ్ లో ఉంటుందంటూ అప్పుడే అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి.

మరి కంటెంట్ పరంగా `పఠాన్` ఏ స్థాయికి తీసుకెళ్తుందన్నది  ఆసక్తికరం. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు.. తమిళ్ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా  యశ్ రాజ్ ఫిలింస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో షారుక్ కి జోడీగా దీపికా పదుకొణే నటిస్తోంది. కీలక పాత్రలో జాన్ అబ్రహం నటిస్తున్నాడు. షారుక్-జాన్ ల మధ్య యాక్షన్ సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు.