Begin typing your search above and press return to search.

ఏడేళ్ల గ్యాప్.. ఏంటిది అవసరాల..?

By:  Tupaki Desk   |   19 March 2023 4:00 PM GMT
ఏడేళ్ల గ్యాప్.. ఏంటిది అవసరాల..?
X
ఓ పక్క నటుడిగా కొనసాగుతూ డైరెక్షన్ చేయడం అన్నది కొద్దిగా రిస్క్ తో కూడుకున్న పనే అని చెప్పొచ్చు. అష్టా చమ్మా సినిమాతో నాని మాత్రమే కాదు అవసరాల శ్రీనివాస్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో నటుడిగా మెప్పించిన అతను ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా కూడా సూపర్ అనిపించాడు. ఇక ఆ తర్వాత జ్యో అచ్యుతానంద సినిమా కూడా చేశాడు అవసరాల శ్రీనివాస్. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది.

ఇక తన థర్డ్ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు అవసరాల శ్రీనివాస్. నాగ శౌర్యతో తీసిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కోవిడ్ కు ముందు నుంచి ప్లానింగ్ లో ఉంది. కోవిడ్ వల్ల రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. ఇక చిన్నగా అన్ని పనులు ముగించుకుని రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచింది. అవసరాల నుంచి ఆడియన్స్ ఆశించిన ఏ ఒక యాస్పెక్ట్ కూడా సినిమాలో కనిపించలేదు. అంతేకాదు ఆడియన్స్ రెండు గంటల సినిమా నీరసం తెప్పిస్తుంది.

అవసరాల శ్రీనివాస్ ప్రతిభ గల దర్శకుడే కానీ అతను చేసిన ఈ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మాత్రం నిరాశపరచింది. ఎక్కడ తన మార్క్ కనిపించలేదు. హీరో హీరోయిన్ తమకు ఉన్న స్కోప్ లో బాగా నటించాలని అనుకున్నా కథ, కథనంలో దమ్ము లేకపోవడం వల్ల వారు ఎంత బాగా నటించినా ఆడియన్స్ కి రుచించలేదు. ఊహలు గుసగుసలాడే లాంటి క్లాసిక్ సినిమా తీసిన అవసరాల శ్రీనివాసే ఈ సినిమా తీశాడా అన్న డౌట్ రాక మానదు.

అయితే ఒక సినిమాకు ఇన్నేళ్లు వర్క్ చేయడం కూడా ఆ సినిమా మీద ఆసక్తి తగ్గేలా చేస్తుంది. సినిమా చూసిన వారంతా కూడా అవసరాల ఒక మంచి ఛాన్స్ మిస్ యూజ్ చేసుకున్నాడు అని అంటున్నారు. కల్యాణి మాలిక్ ఎప్పటిలానే తన మెలోడీ మ్యూజిక్ తో మెప్పించారు. కానీ సినిమాలోనే అసలేమాత్రం మ్యాటర్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.