`డర్టీ హరి`ని మించే లాంటిదే మరొకటి?

Sun Aug 01 2021 07:00:01 GMT+0530 (IST)

MS Raju way of thinking as a director has changed

రొటీన్ కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే రోజులు కావివి. ఈ విషయాన్ని ఒక వెటరన్ నిర్మాతగా ఎనలైజ్ చేసాక దర్శకుడిగా ఎం.ఎస్.రాజు ఆలోచనా విధానమే మారిపోయింది. ఆయన ఎంపిక చేసే కంటెంట్ సంథింగ్ హాట్.. సంథింగ్ స్పెషల్ గానూ కనిపిస్తోంది.ఇంతకుముందు ఆయన డర్టీ హరి చిత్రంతో దర్శకుడిగా విజయం సాధించారు. యూత్ ని ఈ సినిమా థియేటర్లకు రప్పించింది. ఇందులో వేడెక్కించే కథానాయికలతో రాజు గారు మంచి ఔట్ పుట్ రాబట్టుకున్నారన్న ప్రశంసలు దక్కాయి. డర్టీ హరి తర్వాత `సెవెన్ డేస్ సిక్స్ నైట్స్` అంటూ మరో వేడెక్కించే సినిమాని తీస్తున్నారు. ఇది హాలీవుడ్ రియాలిటీ షో రేంజులో జంటల రోమాంచిత విన్యాసాలతో గుబులు రేగడం ఖాయమని తెరపై మంటలు పెడతారని అంచనా వేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమాతో పాటు `హరికథ` అనే మరో సినిమాని ప్రారంభించారు. ఈ చిత్రానికి తనయుడు సుమంత్ అశ్విన్ నిర్మాత. సంక్రాంతి 2022 రిలీజ్ లక్ష్యంగా తెరకెక్కించే సన్నాహకాల్లో ఉన్నారు. లాంచింగ్ ఎప్పుడు? అన్నది వేచి చూడాలి. `డర్టీ హరి`ని మించిన హరికథ ఇందులో చూపిస్తారా? అన్నదే ఇప్పటికి సస్పెన్స్. నటీనటులెవరు అన్నది తెలియాల్సి ఉంది. టైటిల్ పద్ధతిగా ఉంది కదా.. అని మరీ రొటీన్ సినిమా అయితే తీయరనే ఊహించవచ్చు. బాక్సాఫీస్ కలశాన్ని నింపడమే ఇప్పుడు ఫిలింమేకర్ ముందున్న తక్షణ కర్తవ్యం.