'క్రాక్' ను మిస్ చేసుకున్న సీనియర్ స్టార్ హీరో

Wed Jan 13 2021 19:00:01 GMT+0530 (IST)

Senior star hero who missed the Krack

రవితేజ చాలా కాలం తర్వాత 'క్రాక్' సినిమాతో ప్రేక్షకుల నుండి హిట్ టాక్ ను దక్కించుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన క్రాక్ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. దాదాపు పది నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. కరోనా భయం ఇంకా ఉంది. అయినా కూడా క్రాక్ సినిమాను 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేశారు. అయినా కూడా భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి. క్రాక్ సినిమా మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంను అంతా అభినందిస్తున్నారు. ఈ సమయంలో ఈ చిత్రం కథ గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది.ఈ కథ మొదట సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ వద్దకు వెళ్లిందట. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా లేదని మార్పులు అవసరం అంటూ గోపీచంద్ మలినేనికి సూచించాడట. కథలో మార్పులు చేయడం ఇష్టం లేని గోపీచంద్ అదే కథతో రవితేజ ను పెట్టి 'క్రాక్' గా తెరకెక్కించాడు. అలా వెంకటేష్ నుండి క్రాక్ కథ రవితేజ వద్దకు వెళ్లింది. ఇదే కథతో రవితేజ కాకుండా వెంకటేష్ చేస్తే ఎలా ఉండేది అనేది కరెక్ట్ గా చెప్పలేం. కాని ఒక మంచి సబ్జెక్ట్ ను మాత్రం వెంకీ మిస్ చేసుకున్నాడు అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.